అవును ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేయకూదు. అధికారంలో ఉన్న వాళ్ళు తమకు ఎంత దగ్గరైనా ? తమకు ఎంత మద్దతుగా నిలబడుతున్నా సరే కాస్త ముందు వెనుక చూసుకుని మసలుకోవాలి. అలా కాకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే ఏమవుతుంది ? ఇంకేమవుతుంది, ఏబీ వెంకటేశ్వరావుకు అయినట్లే అవుతుంది. ఏబీ వెంకటేశ్వరరావు అనే సినియర్ ఐపీఎస్ అదికారి చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. సామాజికవర్గమే వీళ్ళద్దరిని ఒకటిగా చేసిందనటంలో సందేహం లేదు. చంద్రబాబు మద్దుతుంది కదాని ఏబీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయినట్లు అప్పట్లో బాగా ఆరోపణలున్నాయి. ఏబీ ఏస్ధాయిలో రెచ్చిపోయారంటే కేవలం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందివ్వటంతోనే ఆగిపోలేదు. లా అండ్ ఆర్డర్ లోను, పార్టీలోను, ప్రభుత్వంలో కూడా జోక్యం చేసుకునేవారట.
పార్టీ పదవులకు సంబంధించి తాము ఏబీ ద్వారానే చంద్రబాబును మ్యానేజ్ చేశామని అప్పట్లో టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్ రావు, బుద్దా వెంకన్నే పార్టీ నేతల సమావేశంలో చెప్పుకోవటం అప్పట్లో సంచలనమైంది. అంటే ఇంటెలిజెన్స్ వ్యవహరంలోనే కాకుండా టీడీపీలో నేతలకు పదవులు దక్కే విషయంలో కూడా ఏబీ జోక్యం చేసుకుంటున్నారన్ని తేలిపోయింది. సరే వాళ్ళపార్టీ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు+ఏబీ ఇష్టప్రకారమే జరిగిందని అనుకుందాం. మరి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ విషయంలో ఏబి ఎందుకు వేలుపెట్టారు ? వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు పార్టీని ఫిరాయించి టీడీపీలో చేరటంలో ఏబీదే కీలకపాత్రగా వైసీపీ ఎంఎల్ఏలు, నేతలు చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి ఎంఎల్ఏలపై నిరంతర నిఘాను అంటే షాడో పార్టీని కూడా పెట్టారనే ఆరోపణలకు కొదవేలేదు.
ఇపుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రభుత్వం తనను వేధిస్తోందంటు ఏబి ఐపిఎస్ అధికారుల సంఘానికి లెటర్ పెట్టుకున్నారు. తనను ఎలాగైనా అరెస్టు చేయాలని, సస్పెండ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటు భోరుమంటున్నారు. ఏబీ ఆరోపణలే నిజమనుకున్నా, రాష్ట్రంలో ఇంతమంది ఐపీఎస్ అధికారులుండగా ఒక్క ఏబీ విషయంలోనే ప్రభుత్వం ఎందుకు కక్షసాధింపులకు దిగుతోంది ? ఏబీని వేధింపులకు గురిచేస్తే ప్రభుత్వానికి వచ్చే లాభమేమిటి ? ఏమిటంటే ఎవరు చేసుకున్న ఖర్మను వాళ్ళే అనుభవించాలని పెద్దలు చెప్పే మాట గుర్తుకు రావటం లేదా ? అప్పట్లో ప్రతిపక్షం వైసీపీని ఏబీ తన పరిధిని మించి టార్గెట్ చేశారనే ఆరోపణలకు కొదవేలేదు. అప్పట్లో చేసిన అతి వికటించి ఇపుడు విషంగా ఎదురుతిరిగిందేమో. ఎవరు చేసుకున్న ఖర్మకు ఎవరు బాధ్యులు ?