అసలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే వైసీపీకి చాలా చులకనభావం. దానికితోడు పనవ్ రాజకీయమంతా చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడటం కోసమే అనే బలమైన ముద్రపడింది. పవన్ వైఖరి కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది తాను గెలవాలని, పదవులు చేపట్టాలనే. పార్టీ పెడిడే అధికారంలోకి రావాలనే ఉంటుంది. కానీ పవన్ మాత్రం విచిత్రంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానిచ్చేది లేదంటు మొన్నటి ఎన్నికల్లో చాలెంజ్ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని రోడ్డుషోలు, బహిరంగసభల్లో పవన్ చేసిన చాలెంజులను చూసి జనాలు నవ్వుకున్నారు. అంటే తాను అధికారంలోకి వచ్చేది లేదని ఎలాగూ పవన్ కు బాగా తెలుసు. అందుకనే చంద్రబాబును అధికారంలోకి తేవటం కోసం జగన్ను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించి బోర్లా పడ్డాడు. చివరకు పోటీ చేసేన రెండు చోట్లా పవనే ఓడిపోయారు.
ఈ విషయాలన్నింటినీ మరచిపోయిన పవన్ గుడివాడ రోడ్డుషోలో జగన్ పై మళ్ళీ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో రెచ్చిపోయిన మంత్రులు కొడాలినాని, పేర్నినాని, వెల్లంపల్లి, మేకపాటిలు పవన్ కు చాకిరేవు పెట్టేశారు. పవన్ కూడా కావాలనే కొడాలి నియోజకవర్గమైన గుడివాడలో రోడ్డుషో నిర్వహించి బోడిలింగమంటూ మాట్లాడారు. అసలే పవన్ అంటే నానీలకు చాలా చిన్నచూపు. దాంతో అనవసరంగా వాళ్ళని కెలకటంతో రెచ్చిపోయారు. పవన్ను ప్యాకేజీ స్టార్ అని, రెండుచోట్లా ఓడిపోయిన పవనే బోడిలింగమంటు చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నుండి ప్యాకేజీ ముట్టిన కారణంగానే పవన్ హఠాత్తుగా రోడ్లపైకి వచ్చేసి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు.
పవన్ బోడిలింగమని తెలిసిపోయిన కారణంగానే జనాలు రెండు చోట్లా ఓడగొట్టారంటూ కొడాలి చాలా ఘాటుగా స్పందించారు. విడతల వారీగా చిడతలు వాయించే అలవాటు పవన్ నాయుడే కానీ తమది కాదంటు పేర్నినాని వాయించేశారు. ప్యాకేజి అందగానే పవన్ నాయుడు రోడ్లపైకి వచ్చేశారంటు ఎద్దేవాచేశారు. వీటన్నింటికి అదనంగా జగన్ మాట్లాడుతూ మంగళవారం రైతులకు నష్టపరిహారం అందించబోతున్న విషయం తెలియగానే అర్జంటుగా చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రుడు ఒకేసారి రోడ్లపైకి వచ్చినట్లు జగన్ చేసిన కామెంటు హైలైటుగా నిలిచింది. చంద్రబాబు జూముకు దగ్గరగా భూమికి దూరంగా వెళ్ళిపోయారని జగన్ వేసిన పంచ్ డైలాగ్ బాగా పేలింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ అనవసరంగా మంత్రులను కెలికి వాళ్ళతో చాకిరేవు పెట్టించుకుంటున్నారు.