సెటైర్ : వచ్చాడయ్యో జూనియర్ పీకే ... బాబు గారు హ్యాపీనా ?
అసలు ఆ వైసీపీ కి ఏపీలో ఇన్ని ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి ? మనకెందుకు రాలేదు అని ఆలోచిస్తున్నప్పుడే ఆ పీకే.. అదేనండి ప్రశాంత్ కిషోర్ అనే బీహార్ బాబు వైసీపీ కి రాజకీయ రచనలు చేసిపెట్టేసాడు అనే సంగతి గుర్తుకు వచ్చేసాడు. అసలెప్పుడో పీకే శిష్యుడు రాబిన్ శర్మ ను నియమించేసుకున్నాడు. ఇప్పుడు తిరుపతి లో సైకిల్ సవారి చేసేలా చూడవయ్యా బాబు అంటూ చెప్పి రాజకీయ రచనలు ఎన్నెన్నో చేయాలని బతిమాలాడగా, రాబిన్ శర్మ రకరకాల వ్యూహాలు రచించే పనిలో ఉన్నాడట. ఇప్పుడు ఈ శర్మ గారి మాట.. లెక్క ప్రకారం సైకిల్ తొక్కాలని డిసైడ్ అయిపోయారు.
తిరుపతిని గట్టెక్కించి పుణ్యం కట్టుకోవాలంటూ ఆయన బాటే తమ మాట గా ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయిపోయారు. ఎలాగూ బాబు గారు పార్ట్ టైం పాలిటిక్స్ కి దిగిపోయారు. ఇప్పుడేమో రాబిన్ శర్మ గారి ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్లేందుకు బాబు గారు సిద్ధం అయిపోయారు. తిరుపతిలో సైకిల్ పార్టీని గట్టెక్కించేస్తారో .. ముంచేస్తారో చూడాలి.