సెటైర్ : ఊహలు ఉసూరుమనిపించే ..! ఊరుకుంటే బెటర్ ?

అదిగదిగో నేను నిర్మించిన పెపెంచ రాజధాని ! అదిగదిగో నేను చేసిన అభివృద్ధి. అంటూ అదే పనిగా చెప్పుకుంటూ వచ్చారు బాబు. పెళ్లి లో కొత్త దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించినట్టు. ఆ నక్షత్రం కనిపించకపోయినా కనిపించినట్టు తలకాయ ఊపేస్తూ పోజు ఇస్తుంటారు. ఇప్పుడు జనాలు అంతా అదే విధంగా అరుంధతి నక్షత్రం లా అమరావతిని చూడాలి అనేది బాబు గారి లాజిక్. టీడీపీ హయాంలో బ్రహ్మాండం గా అభివృద్ధి జరిగింది అనేది ఆయన మాట. అప్పుడే ఏడాదికి పైగా అమరావతి లో ఆందోళనలు చేయిస్తూ, రైతుల పోరాటం పేరుతో ఎన్నో రకాలుగా హడావుడి చేస్తూ, పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా బాబు ప్రయత్నిస్తున్నారు. కానీ బాబు ఊహించని సంఘటనలు ఏవీ జరగకపోవడం బాబుకు బాధను కలిగిస్తోంది. అయినా ఆ బాధను దిగమింగుకుని ఏదో హడావుడి అమరావతి కేంద్రంగా చేస్తునే వస్తున్నాడు.




అసలు అమరావతి లో రాజధాని నిర్మించవచ్చా లేదా ? నిర్మిస్తే అది ఎంత ఆర్థిక భారం అవుతుంది అనేది మాకు అనవసరం అని, తమ పార్టీ నాయకులు, సామాజిక వర్గం వారు బాగా లబ్ధి పొందాలి అనే ముందుచూపుతో అమరావతి కి జై కొట్టినా, అక్కడ తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించి , అదే ప్రపంచ స్థాయి రాజధాని అని ప్రచారం చేసుకోవడం, ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని చూపించి ఇదే రాజధాని అంటూ హడావుడి చేయడం ,ఇవన్నీ బాబు కి మాత్రమే చెల్లింది.  వాస్తవ పరిస్థితులకు దూరంగా, రాష్ట్రానికి ఆర్థిక నష్టం చేకూర్చే విధంగా, మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలి అనుకోవడం... కొత్తగా అభివృద్ధి చేసేందుకు  కోటాను కోట్లు కుమ్మరించడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి. టిడిపి ప్రభుత్వం అన్ని తాత్కాలిక భవనాలు వరకే పరిమితం కావడం తప్ప,  శాశ్వత భవనాలు ఏవి నిర్మించ లేకపోయింది. 




అసలు అమరావతి ఉద్యమం ద్వారా టిడిపికి లబ్ధి చేకూర్చి ఇరుకున పెట్టాలని చూస్తున్నా, వాస్తవాలకు దూరంగా, భ్రమల్లో బతికేస్తూ అమరావతి హీట్ పెంచే పనిలో ఉన్నా, అవేవీ వర్కవుట్ కావడం లేదు అనే బాధ, భయం పెరుగుతూ, పెరుగుతూ వస్తున్నాయి.ఇప్పుడు ఎన్ని చేసినా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గదు అనేది తెలిసినా.. బాబు మాత్రం హడావుడి ఓ రేంజ్ లో చేసిపాడేస్తు న్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: