సెటైర్ : అనుమానం... అవమానం.. అనుమానాస్పదం ?

ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వెళ్ళని విధంగా,  చిత్ర విచిత్రమైన రూట్ లో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలు చూస్తే అయ్యో పాపం అని అనాలి అనిపిస్తుంది ఎవరికైనా !! అసలు ఇలా ఎందుకు అనాలి అనిపిస్తుంది అంటే ఏదో తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొంత మంది నాయకులను నమ్ముకుని... ఎన్నో అవమానాలు దిగమింగుకుని చివరకు పార్టీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. అప్పట్లో ప్రజా రాజ్యం లోని యువరాజ్యం అనే ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న పవన్ ప్రజారాజ్యానికి ఎదురైన ఇబ్బందులను, తన అన్న చిరంజీవిని మోసం చేసిన తీరును తట్టుకుంటూ... తిట్టుకుంటూ చివరకు ఆ రాజకీయ కసితోనే సొంతంగా పార్టీ పెట్టి అందరికీ పెద్ద గుణపాఠం చెబుతామని చూశారు. కానీ పార్టీ అయితే స్థాపించారు తప్ప, దానిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంలో గజిబిజి గందరగోళం గురయ్యి, చివరకు 2014లో బిజెపి టీడీపీకి మద్దతు ఇచ్చి... ఇక సొంతంగా పోటీ చేసే అంత బలం లేదు కాబట్టి, ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. 





2019 ఎన్నికల నాటికి అయినా సొంతంగా బలం పెంచుకున్నారా అంటే అదీ లేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు బలం ఎంత అనేది తేలలేదు. ఇలా అయితే లాభం లేదని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుండగా , ఇప్పుడు అదే బిజెపి తరచూ అవమానాలకు గురి చేస్తూ,  జనసేన పార్టీ బలం పెంచుకోకుండా వ్యూహాలు రచిస్తూ, వస్తుండడం నిజంగానే మంట పుట్టిస్తోంది. కాకపోతే ఆ మంటను బయటకి కనిపించేలా చేస్తే మరింత భగ భగ మండుతుంది అనే ఉద్దేశంతో ఆ మంట ని తట్టుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య జరిగిన గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేద్దామని ఉత్సాహంగా అభ్యర్థులను ప్రకటించినా, బిజెపి ఆ ఆశలపై నీళ్లు చిమ్మేసింది. 




పోనీ ఆ త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతి లో పోటీ చేసే అవకాశం ఇస్తారని చూసినా,  చివరకు ఇక్కడ కూడా మేము పోటీ చేస్తాం...మళ్లీ ఎప్పటిలాగే మాకు మీరు మద్దతు ఇవ్వండి అన్నట్లుగా బిజెపి తమ వైఖరిని బయట పెట్టడం తో,  మళ్ళీ ఎప్పటిలాగే జనసేనాని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇవన్నీ జనసేన కు పవన్ కు సర్వ సాధారణం అయిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: