సెటైర్ : బీజేపీ కి జనసేనాని ఎప్పటికీ అర్థమయ్యేనో ?

అసలు పవన్ సంగతి ఏంటో సొంత కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు కానీ, రాజకీయాలలో ఆయన సంగతి ఏంటో పూర్తిగా తెలుసుకుందామని ఎంతగా రాజకీయ పార్టీ లు ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. స్టార్ హీరోగా రెండు తెలుగు రాష్ట్రాలు దుమ్ము దులుపుతున్న,  పవన్ రాజకీయాలలోను మరింతగా దుమ్ము దులుపుతారు అని భావించినా, పవన్ ప్రతి సందర్భంలోనూ తప్పిదాలతో పార్టీని, ఆ పార్టీ పై నమ్మకం పెట్టుకున్న ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ పార్టీ నడిపించే శక్తి సామర్ధ్యాలు ఆయన కు లేవు అనేది అందరి అభిప్రాయం. 



అసలు రాజకీయ అనుభవం లేకనే పవన్ ఒక కాలు టీడీపీలో, మరో కాలు బీజేపీలోని వేసి ఉండేవారు కాదని, సొంతంగానే జనసేనను బలోపేతం చేసి ఉండేవారని, అది అసలు సాధ్యమయ్యే పని కాదని, అందరూ నమ్ముతున్నా, పవన్ మాత్రం ఇంకా చిలిపి చేష్టలు అన్నట్లుగానే పార్టీ నడుస్తున్న తీరు ఆ పార్టీ నాయకులకు అంతుపట్టడం లేదు. అసలు వెళ్ళవలసిన దారి ఏంటి ? ఒక రాజకీయ పార్టీని అధికారం వైపు తీసుకు వెళ్లేందుకు సరైన వ్యూహం లేకపోతే ఏ విధంగా ఉంటుంది ? అనే దానికి  ఉదాహరణగా, జనసేన పార్టీని చూపించే వరకు పరిస్థితి వెళ్లింది. ఏపీలో బీజేపీతో పొత్తు విషయాన్ని పవన్ ఎంత తేలిగ్గా తీసుకున్నారు అంటే,  కనీసం ఆ పార్టీ నేతలు ఎవరితోనూ సంప్రదించకుండా, గ్రేటర్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించేశారు.



 అది కూడా బీజేపీ తెలంగాణ పెద్దల ఒత్తిడితో. ఇదేంటి అని బిజెపి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు తాము పోటీ చేయడం లేదని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ పార్టీకి ఓటు వేయాలి అనే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది.దీంతో అసలు పవన్ యవ్వరం ఏంటో బిజెపి నాయకులకు అర్థం కాని పరిస్థితి. పోనీ ఏదో అలా ఆయన పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ లేకుండా చేసాము అనే సంతృప్తితో ఉన్నా, తమ మిత్రపక్షంగా ఉన్న పవన్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి తరఫున అండగా నిలబడి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారా లేదా అసలు పవన్ ఎన్నికల ప్రచారానికి వస్తారా లేదా అనే సందేహాలు ఎన్నో ఎన్నెన్నో బిజెపి, జనసేన నేతలను వెంటాడుతోంది. గ్రేటర్ లో బీజేపీ ని తాను ఏవిధంగా కన్ఫ్యూజ్ అవుతున్నాను అదేవిధంగా కన్ఫ్యూజ్ చేసే విషయంలో పవన్ సక్సెస్ అయినట్టే అని కనిపిస్తున్నారు అనే సెటైర్ లు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: