అసలు మంచి చేసిన చెడు చేసినా, మేము ఒప్పుకోము గాక ఒప్పుకోము. మాకు రాజకీయాలే కావాలి. అధికార పార్టీని తిట్టిపోయడమే మా ప్రధాన విధి. ఆ విధిని అడ్డుకునేందుకు ఇప్పుడు జగన్ ప్రయత్నించటం దారుణం అంటూ నెత్తీ నోరూ బాదుకొంటూ, ఏపీలో అడుగుపెట్టేందుకు భయపడుతూ, చంద్రబాబు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదట. ప్రతిపక్షాల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ, ఏ సమస్యల పైన పోరాటం చేసే అవకాశం లేకుండా అన్నిటినీ పరిష్కరించుకుంటూ వచ్చేస్తూ ఉండడంతో, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు , పోరాడేందుకు ఏ అవకాశం దొరకక అసలు ఇక్కడ ఉండి ఏం చేయాలో తెలియక హైదరాబాద్ కి వెళ్లి మరి బాధపడుతున్నారట. ఎంత దారుణం.
కాకపోతే, ప్రభుత్వం పేదలను పట్టించుకోకుండా ఏవేవో కల్ల బొల్లి కబుర్లు చెప్పి మభ్య పెట్టి , మసి మారేడు కాయ చేస్తే, ప్రజలకు ఎంత ధైర్యం ఉంటే, ఈ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాడా ? ఏవో కోర్టు అడ్డంకులు సృష్టించి , దానిని వాయిదా వేయించి మళ్ళీ విమర్శలు చేద్దామని ప్రయత్నిస్తే, కోర్టు చిక్కులు ఉన్న వాటిని మినహాయించి, మిగతా అన్నిటి పంపిణీ చేసేందుకు సిద్ధమయిపోతే, నేను దేని మీద పోరాడాలి అనే బాధ ఎక్కువైపోతున్నట్టుగా ఉందట. అంతేనా, అమరావతి అంటూ హడావిడిగా ప్రయత్నాలు చేస్తున్నా, మిగతా ప్రాంతాల్లో సెంటిమెంట్ తీసుకు వచ్చి దాన్ని కూడా లేకుండా చేసేస్తాడా ఈ జగన్ ?
అసలు దేనిమీద పోరాటం చేద్దామన్నా, తమకు అవకాశం లేకుండా చేస్తూ అన్నిటిని పరిష్కరిస్తూ, ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై పోరాటం చేసే అవకాశం లేకుండా చేయడం నిజంగా దారుణమే అంటూ తెగ బాధపడిపోతూ, కొత్త కొత్త ఐడియాలు వేసే పనిలో తండ్రి కొడుకులు ఉన్నారట. మేము అమలు చేయని, మాకు ఆలోచన రాని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దారుణంగా ప్రవర్తిస్తున్నారనే బాధ బాబరు లో ఎక్కువగా ఉందట. ఇక ఇక్కడ పని లేదు కాబట్టే , హైదరాబాద్ కే పరిమితం అయిపోయాడు అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారట.