హెరాల్డ్ సెటైర్ : రాష్ట్రమంతా రోడ్లపైకి రావాలట.. ఈయన మాత్రం ఇంట్లోనుండి కదలరట

Vijaya
చంద్రబాబునాయుడు మనస్తత్వమే విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి మాట్లాడుతారో, ఎప్పుడేమి చేస్తారో ఎవరికీ తెలీదు. హోలు మొత్తం మీద చూస్తే చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుందనైతే అర్ధమైపోయింది. తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇచ్చిన పిలుపు చూస్తే అందరికీ క్లారిటి వచ్చేస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి రాజధాని ఉద్యమం 300 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని జనాలంతా ఉద్యమంగా రోడ్లపైకి రావాలంటూ పెద్ద పిలుపునిచ్చారు. సరే ఇదే విషయమై శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయాలని పిలుపిస్తే ఏమైందో, ఎంతమంది స్పందిచారో అందరు చూసిందే. తాజాగా రాష్ట్రంలోని జనాలంతా రోడ్లపైకి రావాలని, అమరావతిని కదల్చేందుకు లేదంటూ ఉద్యమాలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుందని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.



ఇక్కడ విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతిన కంటిన్యు చేయాలని డిమాండ్ రాజధాని గ్రామాల్లోనే సానుకూలత లేదు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లోని రైతులు, ప్రజలు భూములిచ్చారు. అయితే కొందరు స్వచ్చందంగా భూములిస్తే కొందరిని ప్రభుత్వం భయపెట్టి వాళ్ళ భూములు లాక్కుంది. మరికొందరి భూములను భూసేకరణ చట్టం ద్వారా సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఇపుడు ఉద్యమం పేరుతో జరుగుతున్న ఆందోళనలో మొత్తం 29 గ్రామాల్లోని జనాల నుండే మద్దతు దొరకటం లేదు. చంద్రబాబు+టీడీపీ నేతలు+ఎల్లోమీడియా చెబుతున్న ఉద్యమం అంతా కేవలం ఏ ఏడెనిమిది గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో కూడా రైతులు తక్కువ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రైతుల నుండి భూములు కొనుక్కున్న వాళ్ళ మనుషులే ఎక్కువ.  



ఇదే సమయంలో ప్రభుత్వం నుండి భారీ ఎత్తున భూములు తీసుకున్న వాళ్ళు, బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసిన ప్రముఖులు కూడా తమ మనుషులతో ఉద్యమం పేరుతో ఆందోళనలు చేయిస్తున్నారు.  ఈ విషయాలు అందరికీ తెలిసినవే. అయితే అందరికీ తెలుసన్న విషయాన్ని చంద్రబాబే పట్టించుకోవటం లేదు. రోజుకోసారి రాష్ట్రంలొని జనాలందరినీ రోడ్లపైకి రావాలని పిలుపిస్తున్న చంద్రబాబు తాను మాత్రం ఇల్లొదిలి బయటకు రావటం లేదు. తాను కాదు కదా కనీసం తన కొడుకు లోకేష్ ను కూడా బయటకు వదలటం లేదు. గడచిన ఏడు మాసాలుగా కరోనా వైరస్ పేరుతో హైదరాబాద్ లోని తనింట్లోనే కొడుకుతో గడిపేశాడు. ఏడు మాసాల్లో రెండుసార్లు అమరావతి ప్రాంతానికి వచ్చినా తండ్రి, కొడుకులు ఒక్కసారి కూడా ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి కూర్చుని మాట్లాడింది లేదు.



ఇప్పుడంటే ఉద్యమం 300 రోజులకు చేరుకుందన్న కారణంతో చంద్రబాబు, లోకేష్ అమరావతికి వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి లోకేష్ మాత్రం ఉండవల్లి, పెనుమాక, దొండపాడుతో పాటు కొన్ని గ్రామాల్లో పర్యటించాడు. నిజంగానే అమరావతి కోసం చంద్రబాబు అంత పట్టుదలగా ఉంటే తాను కూడా ఎందుకు రోడ్లపైకి రాకూడదు. ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతోందని చెప్పుకుంటున్నపుడు తాను ముందుండి నడిపితే ఆకాశమంత ఎత్తుకు చేరుకుంటుంది కదా ఉద్యమం. కరోనా వైరస్ సమస్య కారణంగానే ఇంట్లోనే కూర్చున్నాడని చెప్పుకునేట్లయితే మరి ఇదే సమస్య మిగితా వాళ్ళకు కూడా ఉంది కదా ? వాళ్ళు మాత్రం ఉద్యమం పేరుతో రోడ్లపైకి ఎందుకు రావాలి ? చంద్రబాబు మాత్రం ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి ? అంటే త్యాగాలు మాత్రం ప్రజలవి ఏదైనా లబ్ది జరిగితే దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా చంద్రబాబు?  ఇందుకే చంద్రబాబు పిలుపు అపహాస్యం పాలవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: