సెటైర్: పీత సామెత గుర్తుచేస్తున్నారు కదయ్యా !

ఒక పీత పైకి వెళ్తుంటే మరో పీత కాళ్లు పట్టుకుని లాగడం ఎవరూ పైకి వెళ్లకుండా ఒకరిని ఒకరు కిందపడేయడం, ఇదంతా ఐకమత్యం లేకపోవడం, ఈర్ష్య ద్వేషాలకు సంబందించిన అంశాలపై చర్చకు వచ్చినప్పుడు పీత కథను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు ఈ పీతల గోల ఏంటి ? అనుకుంటున్నారా ? ఆగండాగండి అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఆ దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ! ఆ పార్టీ పరిస్థితే ఎవరికీ అర్ధం కావడంలేదు. అసలు మరికొంత కాలం ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చేస్తోంది. కేంద్రంలో ఆ మధ్య పార్టీలోని కురు వృద్ధ నాయకులంతా బెంగపడిపోయి, పార్టీ ఏమైపోతుందో తెలియక కంగారు కంగారు పడిపోయారు గుర్తుంది కదా ? అమ్మా సోనియమ్మ ఈ పార్టీకి ఓ అధ్యక్షుడి పెట్టి పుణ్యం కట్టుకో !

ఇప్పటివరకు పారీని నమ్ముకుని పార్టీలోనే ముసలి వాళ్ళం అయిపోయాం మా పరిస్థితి ఏం గాను అంటూ మొరపెట్టుకుంటే పోన్లే ఎవరికి తప్పినా తప్పకపోయినా నాకు తప్పదు కదా నేనే ఉంటాలే అని అమ్మ దయదలిచి కనికరం చూపించారు. ఇప్పుడేమో తెలంగాణలోనూ అదే సీన్. ఆ కారు పార్టీ రాష్ట్రమంతా స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్ల మీద దూసుకుపోతుంటే, మనకేమో సొంత పార్టీ వొల్లే స్పీడ్ బ్రేకర్లుగా మారిపోయారు.ఏదో నానా కాష్టలు పడి పార్టీని ఓ ఒడ్డుకి చేర్చి ఆ సీఎం కుర్చీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కాలని ఆ రేవంత్ చూస్తుంటే ఇప్పుడేమో సొంత పార్టీ వొళ్ళు ఎక్కడబడితే అక్కడ తిట్టేసుకుని, వీలైతే కొట్టేసుకుని నానా రచ్చా చేసేస్తున్నారు.

అసలు నువ్వెవరవయ్యా ఆ కుర్చీ ఎక్కడానికి ఎక్కితే గిక్కితే, మేమెక్కలి కానీ అంటూ ఒకరిమీద ఒకరు తిట్టిపోస్తూ హడావుడి చేసేస్తూ తన్నుకుంటూ ఉంటే ఆ కారు పార్టీ, ఆ కాషాయ పార్టీ చంకలు గుద్దుకుంటూ వినోదం చూస్తున్నాయి. కాస్త మీ కొట్లాటలు, తన్నులాటలు ఆపి పార్టీని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒకప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండేందట అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అయ్యా బాబు మీకో దండం కాస్త ఆ గోల ఆపి ఆ పోరాటం ఏదో, ఆ తిట్ల దండకం ఏదో, ఆ తన్నులాట ఏంటో ? అసలు మీ వీర ప్రతాపం ఏంటో మీ రాజకీయ శత్రువుల మీద చుపించాడయ్యా...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: