హెరాల్డ్ సెటైర్ : లోకేష్ ను దుమ్ము దులిపేసిన యువరాణి..ముగ్గురికీ తలంటేసింది

Vijaya
చినబాబు నారా లోకేష్ ను పూసపాటి గజపతుల యువరాణి సంచయిత దుమ్ము దులిపేసింది. దులిపేయటమంటే నేరుగా చొక్కా కాలర్ పట్టుకుని కాదు. ట్విట్టర్ వేదికగానే లేండి.  తండ్రి  చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే చినబాబు కూడా ట్విట్టర్ పిట్టద్వారా  అబద్ధాలు కూయిస్తున్నాడు. ఇందులో భాగంగానే లోకేష్ తాజాగా ట్విట్టర్లో మన్సాస్ ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదంటూ ఆరోపించాడు. ఐదు మాసాలుగా ట్రస్టు నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వని కారణంగానే వాళ్ళు రోడ్డునపడి బిక్షమెత్తుకుంటున్నట్లు చినబాబు బుర్రకి తోచిందేదో రాసేశాడు. నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు అందకపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ బురద చల్లేశాడు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా జగన్ పై బురద చల్లనిదే తండ్రి, కొడుకులకు నిద్రపట్టటం లేదటలేండి. అందుకనే మాన్సాస్ ట్రస్టు ఉద్యోగుల విషయంలో కూడా జగన్+సంచయితను కలిపి ఆరోపణలు చేశాడు.




ఇక సంచయిత విషయం చూస్తే ట్రస్టు ఛైరపర్సన్ అయిన దగ్గర నుండి మాంచి దూకుడు మీదుంది. ట్రస్టు ప్రస్తుత పరిస్ధితికి చంద్రబాబు, బాబాయ్ అశోక్ గజపతిరాజే కారణమంటూ ప్రతిరోజు వాయించేస్తోంది. అశోక్, చంద్రబాబు  ట్రస్టు గురించి ఏమన్నా అడ్వర్స్ గా  కామెంట్ చేయటం ఆలస్యం వెంటనే జెట్ స్పీడులో గాలి తీసేస్తోంది.  చంద్రబాబు, అశోక్ కామెంట్లకు సంచయిత ధీటుగా సమాధానాలిస్తునే మళ్ళీ ఎదురు వాయించేస్తోంది. సంచయిత సంధిస్తున్న ప్రశ్నలకు మళ్ళీ వీళ్ళద్దరినుండి సమాధానాలు ఉండటం లేదు. అంటే సంచయిత ప్రశ్నలకు వీళ్ళు సమాధానలు చెప్పలేకపోతున్నారు.  వీళ్ళ పరిస్ధితే ఇలాగుంటే తగుదునమ్మా అంటూ చినబాబు వేలు పెడితే యువరాణి ఊరుకుంటుందా ? అందుకనే ట్విట్టర్ వేదికగా లోకేష్ కామెంట్లకు సంచియిత కూడా అదే పద్దతిలో వాయించేసింది.


​https://twitter.com/sanagajapati/status/1295028707799703552?s=20​​​

ఉద్యోగులకు ఐదునెలలుగా జీతాలు ఇవ్వటం లేదని లోకేష్ చెప్పింది నిజమే. అయితే ట్రస్టు ఛైర్మన్ గా సంచయిత బాధ్యతలు తీసుకుని ఐదు నెలలే అయ్యింది. మార్చిలో బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే  కరోనా వైరస్ సమస్య మొదలైపోయింది. ఇక అంతకుముందు జీతాలంటారా అదంతా అశోక్ ఛైర్మన్ గా ఉన్నప్పటి అంశం కాబట్టి సంచయితకు సంబంధం లేదు. అంటే లోకేష్ చెబుతున్నట్లు ఉద్యోగుల జీతాల సమస్యలో అశోక్+చంద్రబాబుదే బాధ్యత. ఎలాగంటే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తేనే ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలుగుతుంది. 2016 నుండి ట్రస్టుకు ప్రభుత్వం రూ. 20 కోట్లు బకాయిలున్న విషయాన్ని గుర్తుచేసిన సంచియిత అందుకు బాధ్యులెవరో చెప్పాలని చినబాబును నిలదీసింది.




ఇక బాబాయ్ నిర్వాకాన్ని కూడా ఎండగట్టేసింది. ఉన్నత విద్యామండలి అనుమతి లేకుండానే 2018-20 విద్యా సంవత్సరంలో  170 మంది విద్యార్ధులకు బాబాయ్ అశోక్ బికామ్, బీఎస్సీ కోర్టుల్లో అడ్మిషన్లు ఇచ్చిన కారణంగా ఇపుడా డిగ్రీలు చెల్లటం లేదని బాబాయ్ కు తలంటుపోసింది. తాను ఛైర్మన్ అయిన తర్వాతే విద్యార్ధుల సమస్యను పరిష్కరించినట్లు ఛైర్ పర్సన్ స్పష్టం చేయటం గమనార్హం. సరే దీనికి బాబాయ్ నుండి సమాధానం వచ్చే అవకాశాలు లేవులేండి. మొత్తానికి అడిగి తన్నించుకోవటమంటే ఇదేనేమో. వాస్తవాలు తెలుసుకోకుండా, ముందు వెనకా చూసుకోకుండా ఏది పడితే అది ట్విట్టర్లో కూసేస్తే సరిపోతుందని చంద్రబాబు, చినబాబు అనుకుంటున్నారు. అయితే తమకు ఫిట్టింగ్ రిప్లై వస్తే ఏమి చేయాలో వాళ్ళకు అర్ధం కావటం లేదు. ఏదోలే చిన్నపిల్లలే అనుకున్న చంద్రబాబుకే సంచియిత చుక్కులు చూపిస్తోంది. అలాంటిది ఉత్తర కుమారుడు లాంటి లోకేష్ ను వదులుతుందా ? ఒక దెబ్బకు మూడు పిట్టల్లాగ లోకేష్ ఆరోపణలకు సంచియిత లోకేష్ తో పాటు చంద్రబాబు, బాబాయ్ కు కూడా తలంటిపోసేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: