హెరాల్డ్ సెటైర్ :  జగన్ కు మంచిపేరు వస్తోందని ఎల్లోమీడియా ఎంత బాధపడిపోతోందో ?

Vijaya
అవును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న వాస్తవాలను అంగీకరించటానికి ఎల్లోమీడియాకు మనసు రావటం లేదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో అరెస్టయిన 12 మంది వార్తను ప్రచురించటంలోనే ఈ విషయం తెలిసిపోయింది.  ప్రమాదం జరిగినపుడు ఆ ఘటనపై రోజుల తరబడి బ్యానర్ కథనాలు లేకపోతే మొదటి పేజీలో ప్రముఖంగా ఎల్లోమీడియా చాలా వార్తలు అందించింది. ఓకే ఇంతవరకూ కరెక్టే అనుకుందాం. ప్రమాదం జరిగిన విషయాన్ని పక్కనపెట్టేస్తే  యాజమాన్యంపై చర్యలు తీసుకునే విషయంలో జగన్ మేనేజ్మెంట్ తో కుమ్మకైపోయాడంటూ రకరకాల కథనాలు వండి వర్చాయి. యాజమాన్యంలో ఒక్కళ్ళమీద కూడా చర్యలు తీసుకోలేదంటే జగన్ ఏ స్ధాయిలో వాళ్ళతో కుమ్మకైపోయాడో చూడండంటూ ఎల్లోమీడియా డప్పుకొట్టి మరీ గోల చేసింది.

సీన్ కట్ చేస్తే ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటి నివేదిక ఇచ్చిన 24 గంటల్లోనే కంపెనీ సీఈవోతో పాటు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చూడా చేశారు. ఎల్జీ కంపెనీ అంటే దక్షిణకొరియా దేశానికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి  అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా ప్రమాదం జరగ్గానే రెండు దేశాల మధ్య తీవ్రమైన చర్చలు కూడా జరిగాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆదుకోవటానికే జగన్ ప్రభుత్వం ముందు ప్రయారిటి ఇచ్చింది. దాంతో పాటు ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు హైపవర్ కమిటిని నియమించింది. కమిటి నియమించింది కాబట్టే బాధ్యుతలు ఎవరో తెలీదు కాబట్టే అప్పట్లో ఎవరిమీద చర్యలు తీసుకోలేదు.

కమిటి నివేదిక ఇవ్వటంతో పాటు బాధ్యులెవరో కూడా స్పష్టంగా చెప్పింది. అందుకనే 24 గంటల్లోనే చర్యలు తీసుకుంది. మరి ప్రభుత్వ పరంగా బాధ్యుతలపై కేసు పెట్టి అరెస్టు చేసినపుడు ఆ వార్తను కూడా ఎల్లోమీడియా ప్రముఖంగా ప్రచురించాలి కదా. కానీ ఎక్కడా వార్త కనబడలేదు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ’మీకు మీరే రక్ష’ అనే కరోనా వైరస్ కథనంపై బ్యానర్ ఇచ్చింది. ఇది కూడా ప్రభుత్వానికి నెగిటివ్ స్టోరీనే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే సెకండ్ బ్యానర్ గా ’మెరుపులా జంప్’ అంటూ రాజధాని తరలింపుపై ఇంకో కథనాన్ని అచ్చేసింది. ఇది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన స్టోరీనే.

మొదటిపేజీలో అనేక వార్తలు ఇచ్చిన ఎల్లోమీడియా చివరకు చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణ ’ పట్టాలకు కాదు అవినీతికే అడ్డు’ అంటూ హెడ్డింగ్ ను ప్రముఖంగా అచ్చేసింది. తప్పదన్నట్లుగా ’ఎల్జీ పాలిమర్స్ ఎండి అరెస్ట్’ అంటూ చిన్నగా ఓ హెడ్డింగ్ పెట్టింది. దీని కంటిన్యుయేషన్ 3వ పేజీలో ఉందని ఇండికేషన్ ఇచ్చి వదిలేసింది. 3వ పేజీలో కూడా ఓ డబల్ కాలమ్ వార్తను ప్రచురించింది. కంపెనీ యాజమాన్యంతో జగన్ కుమ్మకయ్యాడంటూ పెద్ద పెద్ద స్టోరీలు అచ్చేసిన ఇదే ఎల్లోమీడియా కంపెనీ ఎండిని అరెస్టు చేసిన విషయాన్ని మాత్రం చిన్న ఇండికేషన్ ఇచ్చి వదిలేయటంతోనే ఉద్దేశ్యం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: