అధికారంలో ఉన్నపుడు ఇదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు సిబిఐని రాష్ట్రంలోకి రానీయకుండా బ్యాన్ చేసిన విషయం గుర్తుంది కదా. ఇపుడు ఇదే చంద్రబాబు అదే సిబిఐ విచారణను ఆహ్వానిస్తున్నాడు. సిబిఐని రాష్ట్రంలోకే రానిచ్చేది లేదన్న చంద్రబాబు ఇపుడు అదే సిబిఐ విచారణను ఎందుకు స్వాగతిస్తున్నాడు ? ఎందుకంటే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే. చంద్రబాబు ఎప్పుడూ ఇంతే.
అధికారంలో ఉంటే సర్వ వ్యవస్ధలను తన గుప్పిట్లోనే ఉండాలని కోరుకుంటాడు. అలా కుదరకపోతే బురద చల్లి గబ్బు పట్టించటమో లేకపోతే రాష్ట్రంలోకి రాకుండా బ్యాన్ చేయటమో చేస్తాడు. తాను సిఎంగా ఉన్నపుడు ప్రతిపక్షాలను ఉండకూడదంటాడు. అఖిలపక్ష సమావేశాలు అవసరమే లేదు పొమ్మంటాడు. పోలీసులు, సిబిఐతో పాటు అన్నీ వ్యవస్ధలు తనకే పనిచేయాలని కోరుకుంటాడు. మరి అప్పుడు సిబిఐని ఎందుకు బ్యాన్ చేశాడు ?
ఎందుకంటే అప్పటికి ప్రధానమంత్రి నరేంద్రమోడితో చెడింది కాబట్టే. సిబిఐ విచారణ పేరుతో తనను కేంద్రం ఎక్కడ అరెస్టు చేయిస్తుందో అనే భయంతో ఏకంగా సిబిఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టడాన్నే నిషేధించాడు. సరే తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలో నుండి జనాలు చంద్రబాబును నిషేధించారనుకోండి అది వేరే సంగతి.
ఇపుడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు కదా అందుకనే రాష్ట్ర పోలీసులపై మండిపడుతున్నాడు. ఇపుడు సిబిఐ ముద్దొస్తోంది. ఎందుకంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటారని ఆరోపిస్తున్నాడు. అంటే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన మాటే చెల్లుబాటవ్వాలనే పిచ్చి బాగా ముదిరిపోయింది చంద్రబాబులో. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు. తాజాగా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తు హైకోర్టు ఆదేశించటాన్ని చంద్రబాబు స్వాగతించటం ఇదులో భాగమనే అనుకోవాలి.
మొత్తం ఎపిసోడ్ లో నిజానికి డాక్టర్ దే తప్పుంది. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ఉన్నతాధికారులనే నోటికొచ్చినట్లు మాట్లాడి సస్పెండ్ అయ్యాడు. తర్వాత విశాఖ రోడ్డులో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు జాతరలో తిట్టినట్లు తిట్టినా డాక్టర్ పై చర్య తీసుకోకూడదట. ఏమంటే దళితుడని, గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్న సుధాకర్ పై పోలీసులు ధౌర్జన్యం చేశారంటూ చంద్రబాబు, పవన్, బిజెపి, సిబిఐ నేతలంతా మూకుమ్మడిగా జగన్ పై ఆరోపణలు గుప్పిస్తుండటమే విచిత్రంగా ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: