ఎర్రిపు : 19 ఏళ్లు అయినా ఆ హీరోయిన్ ను వదలట్లేదుగా..!

shami

2001లో ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీయ శరణ్. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్స్ తో పాటుగా స్టార్స్ గా ఉన్న వారందరితో కలిసి నటించిన ఈ అమ్మడు 19 ఏళ్ల సుధీర్గమైన కెరియర్ లో కూడా మంచి ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం సీనియర్ స్టార్స్ కు మొదటి ఆప్షన్ అవుతున్న శ్రీయా శరణ్ లేటెస్ట్ గా మరో రెండు ఛాన్సులు అందుకుందని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయా శరణ్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

 

బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించిన శ్రీయా బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత పూరి డైరక్షన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో కూడా శ్రీయా శరణ్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి శ్రీయాకు ఛాన్స్ ఇస్తున్నాడట బాలకృష్ణ. శ్రీయాకు బదులుగా ఒకరిద్దరు ఫాం లో ఉన్న హీరోయిన్స్ ను అడుగగా వారెవరు ఇంట్రెస్ట్ చూపించలేదట. అందుకే మళ్లీ చిత్రయూనిట్ శ్రీయకే ఓటు వేశారట.

 

ఇన్నేళ్ల కెరియర్ లో శ్రీయా అప్పటికి ఇప్పటికి తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్న ఈ అమ్మడు సరైన అవకాశం వస్తే సత్తా చాటుతుంది. బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ సక్సెస్ కాగా హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సినిమాలో హీరోయిన్ గా శ్రీయా నటించడం కూడా సినిమాకు ప్లస్ అయ్యే అంశమే అని చెప్పొచ్చు. బాలకృష్ణ, శ్రీయ జోడీ కట్టడంపై నందమూరి ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ జంట ఆల్రెడీ చూసిందే కదా అని అనుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: