ఆసియా కప్ విషయంలో.. పంతం వీడిన బీసీసీఐ?

praveen
ఆసియా కప్ 2023 టోర్నిని ఎక్కడ నిర్వహిస్తారు అన్నది తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఒకవేళ పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము టోర్నీ నుంచి తప్పుకుంటాము అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయినా బీసీసీఐ లేకుండా ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనుకోవట్లేదు. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్లో కాకుండా మరో వేదికపై ఆసియా కప్ నిర్వహించాలని గత కొంతకాలం నుంచి చర్చలు జరుపుతుంది.

 అయితే ఎట్టి పరిస్థితుల్లో తటస్థ వేదికపై టోర్ని నిర్వర్తిస్తేనే తాము ఆసియా కప్ లో పాల్గొంటామని అటు బీసీసీఐ మొండి పట్టుతో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో బీసీసీఐ కాస్త వెనక్కి తగ్గింది అన్నది తెలుస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని ఇతర క్రికెట్ బోర్డుల హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించడంతో బీసీసీఐ కూడా ఇప్పుడు ఈ మోడల్ లో ఆడటానికి అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే బిసిసిఐ ఇలా పంతం వీడటానికి ముందు కొత్త షరతు  పెట్టిందట. 2023 వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టును భారత్కు పంపేందుకు పిసిబి లిఖితపూర్వక హామీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గుతాము అంటూ బీసీసీఐ స్పష్టం చేసిందట.

 అయితే ప్రస్తుతం జరిగిన ఒప్పందం ప్రకారం అటు ఆసియా కప్ పాకిస్తాన్లోనే జరుగుతుంది. కానీ భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈనెల 27వ తేదీన అహ్మదాబాద్ లో జరగనున్న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఇక ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. కాగా ఆసియా కప్ సెప్టెంబర్ 2023లో నిర్వహించనున్నారు. అదే సమయంలో ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అంతకుముందు అటు బీసీసీఐ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ వెళ్ళబోము అంటూ స్పష్టం చేయడంతో తాము కూడా భారత్ వేదికగా జరిగే  వరల్డ్ కప్ నుంచి తప్పకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: