ధోనికి.. ఇతర జట్ల కెప్టెన్లకు మధ్య ఉన్న తేడా అదే : మోయిన్ అలీ

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించి. అటు ప్లే ఆఫ్ కి దూసుకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు గుజరాత్ టైటాన్స్ తోలి క్వాలిఫైయర్ మ్యాచ్లో తలబడేందుకు సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకటి, రెండు మ్యాచ్లలో విఫలమైనప్పటికీ వరుసగా అవకాశాలు ఇచ్చి ఆటగాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి.. ఫలితం రాబట్టడంలో ధోని నేర్పరి అంటూ మోయిన్ అలీ చెప్పుకొచ్చాడు.

 ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన ఇంటర్వ్యూలో మోయిన్ అలీ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ప్రతి జట్టుకు కూడా కెప్టెన్ అనేవాడు ఎంతో కీలకం  అతను తీసుకునే నిర్ణయాలపై జట్టు ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ యువ క్రికెటర్ల నుంచి మంచి ఫలితాలు రాబట్టగలిగితే ఇక అంతకు మించిన గొప్ప కెప్టెన్సీ ఇంకెక్కడ ఉండదు. అయితే అత్యుత్తమ జట్టులో ఇక తుది జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం తీవ్రమైన పోటీ ఉండడం చాలా సర్వసాధనం. అయితే అవకాశం వచ్చినప్పుడు తమను నిరూపించుకున్నందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. ఇలాంటి అవకాశాలు తరచూ రావు. వచ్చినప్పుడు వదులుకోకూడదు. అయితే ఆటగాళ్లలో ఇలాంటి ఆలోచన రావడానికి కారణం కెప్టెన్.

 ఇక ప్రతి యంగ్ ప్లేయర్ కి అవసరమైన చర్యలను కెప్టెన్ మేనేజ్మెంట్తో మాట్లాడి తీసుకుంటూ ఉంటాడు. ఇదే మిగతా కెప్టెన్లకు మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న తేడా అంటూ మోయిన్ అని చెప్పుకొచ్చాడు. ఆరంభంలో రెండు మూడు మ్యాచ్ లు సరిగా ఆడకపోతే.. ఆటగాళ్లను అందరూ పక్కన పెడుతూ ఉంటారు. కానీ ధోని మాత్రం అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్లేయర్ లో ఎంత సత్తా ఉంది అన్నది మాత్రమే ధోని చూస్తాడు. అందుకే వరుసగా ఛాన్సులు ఇస్తాడు. ఇలా ఇతర జట్లు ఉండలేవు అంటూ మొయిన్ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: