ఎప్పటికీ.. నా లక్ష్యం అదొక్కటే : ఉమ్రాన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడి ఒక్కసారిగా తన స్పీడ్ బౌలింగ్ తో వెలుగులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. భారత క్రికెట్ హిస్టరీలో ఏ బౌలర్కు సాధ్యం కాని రీతిలో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసిరి అందరు చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే అతను ఆడిన మొదటి సీజన్ తర్వాత ఇక వెంటనే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్ను అటు టీమ్ ఇండియాలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

 ఆ రేంజ్ లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్ బౌలింగ్తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే గత ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అన్ని మ్యాచ్లలో ఆడిన ఉమ్రాన్ మాలిక్.. ఈ ఏడాది మాత్రం ఇలాంటి అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ఇక వైవిధ్యమైన బంతులు సంధించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ఇటీవల  ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది సన్రైజర్స్. 200 పరుగులు సాధించిన కూడా బౌలింగ్లో విఫలమై చివరికి భారీ స్కోర్ చేసుకోలేకపోయింది.

 అయితే ఉమ్రాన్ మాలిక్ విఫలం కావడంతో ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లకు ఇక సన్రైజర్స్ యాజమాన్యం అతని పక్కన పెట్టింది అన్న విషయం తెలిసిందే.  ముంబై తో జరిగిన మ్యాచ్లో మూడు ఓవర్ లలో ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఉమ్రాన్. గత సీజన్లోని అన్ని మ్యాచ్ లలో కూడా ఆడాను. ప్రతి మ్యాచ్ లో పూర్తి ఓవర్ల కోటాను పూర్తి చేశారు. ఈసారి మాత్రం చాలా తక్కువ ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసుకున్నా.. జట్టులో స్థానం దొరకనప్పుడు నెట్స్ లో చాలా ప్రాక్టీస్ చేస్తాను. వేగం నా బౌలింగ్ పై ప్రభావం చూపుతుంది అని భావించడం లేదు. నేను కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసినప్పుడు నన్ను నేనే ఛార్జ్ చేసుకోవడానికి ఇంకొన్ని ఓవర్లు అవసరం. ఫేస్ తో పాటు లెన్త్ రాబట్టేందుకు కాస్త సమయం పడుతుంది. జట్టులు వికెట్లు అవసరం అయినప్పుడు నా లక్ష్యం వికెట్లు తీయడమే అంటూ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: