డబ్ల్యూటీసి ఫైనల్.. విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన పాంటింగ్?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ఆడుతూ బిజీ బిజీగా ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ కూడా ఐపీఎల్ ముగిసిన వెంటనే కేవలం కొన్ని రోజులు వ్యవధి లోనే  అటు టీమిండియాను విశ్వవిజేతగా నిలపడం కోసం పోరాటం చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సొంతం చేసుకోవడం ద్వారా టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ కు అర్హత సాధించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఎవరు గెలుస్తారు అనే విషయంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఆస్ట్రేలియాకే విన్నింగ్ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. అయితే దీని వెనుక కారణాలు కూడా చెప్పాడు. ఓవల్లో పిచ్ ఆస్ట్రేలియన్ వికెట్ మాదిరిగానే ఉంటుంది. ఇండియా కంటే ఆస్ట్రేలియా కు ఇక్కడ కొంచెం అనుకూలించే అవకాశం ఉంది. అందుకే ఆస్ట్రేలియా కి గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

 అయితే ఒకవేళ ఇదే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ భారత్ లో జరిగి ఉంటే మాత్రం ఇక టీమ్ ఇండియాకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవని చెప్పేవాడిని అంటూ తెలిపాడు. ఒకవేళ ఆస్ట్రేలియాలో జరిగితే ఆస్ట్రేలియాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవాడిని అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుంది. అక్కడ పిచ్ పై రెండు జట్లకు విజయం లిటిల్ క్లోజ్ గా ఉండే అవకాశం ఉంది అంటూ పాంటింగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: