రింకు సింగ్ విధ్వంసానికి బలై.. రీ ఎంట్రీలో మాత్రం అదరగొట్టాడు?

praveen
గత ఏడాది ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. అయితే ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇక ఈ టోర్నీలో కొనసాగుతున్న కొన్ని జట్లకు సాధ్యం కాని రికార్డును అటు గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్లోనే సాధించింది అని చెప్పాలి. అయితే గుజరాత్ మొదటి సారి విజయం సాధించడంతో హార్దిక్ కెప్టెన్సీ ప్రతిభ ఏంటో  అందరికీ అర్థమైంది.

 అయితే ఇక గుజరాత్ టైటాన్స్ మెరుపులు కేవలం ఒక్క సీజన్కే పరిమితం అని.. ఏదో అదృష్టవశాత్తు టైటిల్ విజేతగా నిలిచారు అని కొంతమంది విమర్శలు కూడా చేశారు.  కానీ ఇక మొదటి సీజన్ జోరునే ఇప్పుడు రెండో సీజన్లోనూ కొనసాగిస్తుంది గుజరాత్. మిగతా ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో విన్నింగ్ పర్సంటేజ్ కొనసాగిస్తూ ఎప్పుడు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన గుజరాత్ జట్టు 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది.

 అయితే ఇలా గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు యష్ దయాల్. అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో రింకు సింగ్ యష్ దయాల్ బౌలింగ్లో 5 సిక్సర్లు బాది ఇక అద్వితీయమైన ఇన్నింగ్స్ తో కోల్కతా జట్టును విజయం సాధించాడు. అయితే రింకు సింగ్ ఇన్నింగ్స్ తర్వాత బెంగతో యష్ దయాల్కి జ్వరం వచ్చిందని.. నాలుగు కిలోల బరువు కూడా తగ్గాడు అంటూ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే దాదాపు 9 మ్యాచ్ ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన యష్ దయాల్ తొలి ఓవర్ లోనే వికెట్ పడగొట్టి అదరగొట్టాడు. ఇటీవల సన్రైజర్స్ తో మ్యాచ్లో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: