ఐపీఎల్ : ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్?

praveen
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ కూడా తమ ఫేవరెట్ టీం ని ఎంకరేజ్ చేసేందుకు స్టేడియం కు తరలి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న సమయంలో ఒక అభిమానుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలా తమ అభిమాన జట్టుని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన అభిమానులు ఆ జట్టులో ఎవరైనా ప్లేయర్స్ వికెట్ కోల్పోయారు అంటే తెగ బాధ పడిపోతూ ఉంటారు.

 ఒక్క వికెట్ కోల్పోకుండా ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించాలి అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. చెన్నై జట్టుకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన అభిమానులు ఇక ఆ జట్టులోని బ్యాట్స్మెన్లు అందరూ ఎప్పుడెప్పుడు అవుట్ అవుతారా అని వేచి చూస్తూ ఉంటారు అని చెప్పాలి. దీనికంతటికీ కారణం జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇక ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోని అభిమానులందరూ కూడా ఇక చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడిన భారీగా తరలిస్తున్నారు.

 ధోని బ్యాటింగ్ గురించి అటు అభిమానులు ఎంతలా వేచి చూస్తున్నారో అన్నది ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి నిరూపితమైంది.  కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా తొలి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసి జడేజా వైభవ్ ఆరోరా బౌలింగ్ లో  క్యాచ్ ఔట్ అవుతాడు. అయితే అప్పటికి  సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తవ్వటానికి..  కేవలం రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాట్స్మెన్ అవుట్ అయితే అభిమానులు బాధపడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జడేజా అవుట్ కాగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.  ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టే సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: