ముఖేష్ అంబానీనా మజాకా.. హాట్ స్టార్ కి బిగ్ షాక్?

praveen
ఏదైనా వ్యాపారంలో రాణించాలి అంటే తప్పనిసరిగా మాస్టర్ మైండ్ ఉండాల్సిందే . అలాంటి మాస్టర్ మైండ్ ఉంది కాబట్టి ముఖేష్ అంబానీ అడుగుపెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా సూపర్ సక్సెస్ అవుతూ ఉంటారు. రిలయన్స్ పేరును జియో గా మార్చి అంబానీ ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇండియాలోనే జియో నెంబర్ వన్ కంపెనీగా కొనసాగుతుంది. అంతేకాదు ఇక ఎప్పటికప్పుడు కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతూ సూపర్ సక్సెస్ అవుతున్నారు ఆయన. ఇక ఇప్పుడు జియో సినిమా యాడ్ ద్వారా కూడా ఇలా మాస్టర్ మైండ్ తో సూపర్ సక్సెస్ అయ్యాడు ముఖేష్ అంబానీ.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న క్రేజ్ ని బాగా క్యాష్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఐపీఎల్ వస్తుందంటే చాలు మ్యాచ్లను లైవ్ లో చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ లైవ్ ప్రసారం అయ్యేది. అయితే ఇక ఈ మ్యాచ్లను చూడాలి అంటే తప్పనిసరిగా ప్రేక్షకులు యాప్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ కొంతమంది సామాన్య ప్రేక్షకులు మాత్రం ఇలా డబ్బులు చెల్లించి ఐపీఎల్ చూసేందుకు కాస్త ఇబ్బంది పడేవారు. ఇలాంటివారిని తన వైపుకు తిప్పుకునేందుకు ముకేశ్ అంబానీ మాస్టర్ ప్లాన్ వేశాడు. జియో సినిమా ద్వారా ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లను చూసే అవకాశాన్ని కల్పించాడు.

 ఇక ముఖేష్ అంబానీ వేసిన ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఇలా జియో సినిమా ద్వారా ఐపీఎల్ మ్యాచ్లను ఫ్రీగా చూసే అవకాశం ఉండడంతో ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ షాక్ తగిలింది. ఈ జనవరి నుంచి మార్చి వరకు హాట్స్టార్ ఏకంగా 40 లక్షల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీని ప్రధాన కారణం అటు జియో సినిమానే అన్నది తెలుస్తుంది. ఈ యాప్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ ఫ్యాన్స్ ఉచితంగా ఐపిఎల్ చూస్తున్నారు. దీంతో చార్జీలు చెల్లించి మరి అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇక ఆ సంస్థకు భారీష్ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: