చాహల్ స్పిన్ ముందు.. అగ్రస్థానం మోకరిల్లింది?

praveen
ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన బౌలర్లు ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడల్లా టీమిండియా స్టార్ స్పిన్నర్ అయిన చాహల్ పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఐపీఎల్లోకి కొత్తగా యువ బౌలర్లు ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతూ ఉన్నప్పటికీ.. సీనియర్ బౌలర్ చాహల్ మాత్రం ప్రతి సీజన్లో తన హవా నడిపిస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడు చూసినా కూడా అటు ఎక్కువ వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకోవాల్సిన ఆటగాళ్ల లిస్టులో ఇకమొదటి వరుసలో కనిపిస్తూ ఉంటాడు చాహల్. ఇలా తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడు మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.

 తన బౌలింగ్లో బ్యాటింగ్ చేస్తున్నది ఎంతటి స్టార్ అయినా సరే పట్టించుకోకుండా మైండ్ గేమ్ ఆడుతూ బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్లు చేజేతులారా తప్పు చేసి వికెట్ కోల్పోయేలా టేమిట్ చేస్తూ బంతులను విసురుతూ ఉంటాడు. చివరికి వికెట్ సాధించి ఇక జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు చాహల్. అయితే ఇప్పటికే తన స్పిన్ బౌలింగ్ తో ఐపీఎల్ హిస్టరీ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు చాహల్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చాహల్ ఐపీఎల్ హిస్టరీలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

 ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు ఈ టీమిండియా స్టార్ స్పిన్నర్. చాహల్ ఇప్పటివరకు ఐపీఎల్లో186 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.  అంతకుముందు అత్యధిక వికెట్లుతీసిన బౌలర్గా బ్రావో మొదటి స్థానంలో ఉండేవాడు. 183 వికెట్లతో ఈ ఘనత సాధించాడు. ఇక ఇప్పుడు 186 వికెట్లు పడగొట్టి చాహల్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఇక ఇప్పుడు ఈ లిస్టులో పియూస్ చావ్లా 174, అమిత్ మిశ్రా 172, రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన చాహల్ ఏకంగా  నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: