CSK vs DC: ఆ ఖరీదైన ప్లేయర్ ఇక లేనట్టే?

Purushottham Vinay
చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023లో 12వ మ్యాచ్‌ని ఈరోజు (మే 10) చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంతో ఆడనుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఆ టీం స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గురించి పెద్ద ప్రశ్న తలెత్తింది. ఢిల్లీ టీంతో జరిగే మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ టీంలో ఉంటాడా? లేదా? అనే ప్రశ్నలు చాలా ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో స్టోక్స్ ఇప్పటి దాకా కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.అందులో అతని ప్రదర్శన చాలా దారుణంగా ఇంకా పేలవంగా ఉంది.ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో స్టోక్స్‌ను ఏకంగా రూ. 16.25 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. స్టోక్స్ ఇంకా తన ధర ట్యాగ్‌కు అసలు ఏ రకంగా కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌లలో, అతను దారుణంగా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక ఓవర్‌లో మాత్రమే అతను 18 పరుగులు వెచ్చించాడు. మిగిలిన మ్యాచ్‌లలో అయితే బెన్ స్టోక్స్ గాయం కారణంగా బెంచ్‌పై కూర్చున్నాడు.


ఇక బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ మాట్లాడుతూ, స్టోక్స్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడని సెలక్షన్ కి అందుబాటులో ఉన్నాడని ప్రకటించాడు. పిచ్‌ల స్వభావం ఇంకా ప్లేయింగ్ XI కలయిక కారణంగా అతను గత కొన్ని మ్యాచ్‌లలో ప్లేయింగ్ XI నుంచి దూరంగా ఉన్నాడని తెలిపాడు.ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్‌ మరోసారి ఔట్‌ కావలసి వస్తుందని కూడా చెప్పొచ్చు.టీంలో ఇప్పటికే డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.ఇప్పటి దాకా నలుగురు ఆటగాళ్లు జట్టుకు మంచి ప్రదర్శన చేశారు. ఈ విధంగా చూస్తే బెన్ స్టోక్స్‌కు టీంలో చోటు దక్కేలా కనిపించడం లేదు.చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయానికి వస్తే..రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఇంకా ఎంఎస్ ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతిషా పతిరనా ప్లేయర్లు ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: