ధోని కెప్టెన్ అయ్యుంటే.. RCB మూడు టైటిల్స్ గెలిచేది?

praveen
భారత క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో ధోని భారత జట్టును మూడుసార్లు విశ్వవిజేతగా నిలిపాడు. మూడు సార్లు ఐసిసి ట్రోఫీ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీ సాధించిన కెప్టెన్ గాను ధోని రికార్డు సృష్టించాడు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదండోయ్ అటు ఐపిఎల్ లో సైతం ధోనీ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి.

 ఐపీఎల్ టోర్నీలో సైతం తన కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించాడు. ఎందుకంటే  ధోని కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలపాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఛాంపియన్ టీం గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  అందుకే మహేంద్ర సింగ్ ధోనీని భారత క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా అభిమానిస్తూ ఉంటారు విశ్లేషకులు. ఇకపోతే ఇటీవలే ధోనీ కెప్టెన్సీ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఆర్సిబికి ధోని కెప్టెన్ అయి ఉంటే మాత్రం ఇప్పటికే ఆ జట్టు మూడు టైటిల్స్ గెలిచి ఉండేది అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. బెంగళూరుకు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ.. ధోని మాయ ప్రత్యేకం అంటూ తెలిపాడు. బయటకు కామ్ గా కనిపించిన అతని మదిలో మ్యాచ్ ప్రణాళికలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వసీం అక్రమ్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న ధోని అభిమానులు మీరు చెప్పింది నిజమే.. ధోని ఎక్కడ కెప్టెన్ గా ఉన్న టైటిల్ ఆ టీం కి రావడం పక్కా అంటూ మహి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: