సొంత దేశం నన్ను నమ్మలేదు.. కోల్కత్తా నమ్మింది : రస్సెల్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారు కేవలం కొంతమంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అటు వెస్టిండీస్  క్రికెటర్లే ఎక్కువమంది ఉన్నారు. వెస్టిండీస్ జట్టు తరఫున ఇప్పటివరకు ఎంతమంది ఐపీఎల్లో రాణిస్తూ వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి  తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అయితే ఇలా పవర్ హిట్టర్ అని పేరు సంపాదించుకున్న వారిలో ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న  రస్సెల్ కూడా ఉన్నాడు అని చెప్పాలి.

 ఎన్నో ఏళ్ల నుంచి రస్సెల్ కోల్కతా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎన్నిసార్లు వేలం జరిగిన కూడా జట్టు యాజమాన్యం అతన్ని అంటి పెట్టుకుంటూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ తన విధ్వంసకరమైన ఆట తీరుతో రసల్ బౌలర్లకు వణుకు పుట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో  వీర విహారం చేస్తూ ఉంటాడు. అందుకే ఆండ్రూ రస్సెల్ కి పవర్ హిట్టర్ అనే పేరు కూడా వచ్చింది అని చెప్పాలి. అయితే బౌలింగ్ లోకి కూడా వికెట్లు పడగొడుతూ జట్టును విజయ తీరాల వైపుకు నడిపిస్తూ ఉంటాడు ఈ విధ్వంసకర ప్లేయర్.

 ఈ క్రమంలోనే ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వరుసగా మ్యాచ్ లలో విఫలం అవుతున్నప్పటికీ కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం తప్ప సొంత దేశం సైతం తన పట్ల విశ్వాసం చూపించలేదు అంటూ రస్సెల్ వ్యాఖ్యానించాడు. చాలా అంశాల్లో కోల్కతా జట్టు యాజమాన్యం తనకు అండగా నిలిచిందని.. మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడినప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించింది అంటూ వివరించాడు. అందుకే ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీజన్లో 8 మ్యాచ్ లు ఆడిన ఆండ్రూ రస్సెల్ 108 పరుగులు చేసి ఐదు వికెట్లు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: