ఐపీఎల్ : టైం ముగిశాక రివ్యూనా.. ఇదెక్కడి రూల్?

praveen
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ప్రకారమే తమ ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెట్ లో ఉన్న రూల్ ప్రకారం ఎంపైర్ ఏదైనా నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఇక అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీనినే క్రికెట్ పరిభాషలో డిఆర్ఎస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఫీల్డర్లు అప్పీల్ చేసిన సమయంలో ఎంపైర్ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన కేవలం 15 సెకండ్ల లోపు మాత్రమే ఇలా రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

 నిర్ణీత సమయంలోపు డిఆర్ఎస్ తీసుకున్నప్పుడు మాత్రమే థర్డ్ అంపైర్ కు అది వెళ్తుంది అని చెప్పాలి. సమయం దాటిపోతే ఫీల్డ్ అంపైర్ డిఆర్ఎస్ను కాల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల ipl లో మాత్రం ఈ నిబంధనను గాలికి వదిలేసారు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి బంతిని సహా ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడింది.

 దీంతో ఇషాన్ కిషన్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ కూడా అవుట్ గా ప్రకటించాడు. అయితే సాహా మాత్రం వెంటనే రివ్యూ కు వెళ్లలేదు. ముందుగా తన సహచర బ్యాట్స్మెన్ అయినా శుభమన్ గిల్ తో చర్చలు జరిపిన తర్వాత రివ్యూ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు చర్చించుకునేలోపే ఇక రివ్యూ తీసుకునేందుకు ఇచ్చే పదిహేను సెకండ్ల గడువు ముగిసింది అని చెప్పాలి. ఈ విషయం మాత్రం ఫీల్డ్ ఎంపైర్ గమనించలేదు. అయితే నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గుజరాత్ బ్యాట్స్మెన్  సాహ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఫీల్డ్ ఎంపైర్ గమనించకుండా.. ఆ రివ్యూని థర్డ్ అంపైర్ కు పంపించాడు. ఇక ఈ రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. అయితే ఇలా నిబంధనలు గాలికి వదిలేయటం పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: