అతన్ని టెస్ట్ ప్లేయర్ అన్నారు.. కానీ ఈ ఐపీఎల్ లో అతనే తోపు?

praveen
ఈ సీజన్ కి ముందు వరకు కూడా అతను ఐపీఎల్ కి అన్ ఫీట్ ప్లేయర్. అంతేకాదు అతను ఒక టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. అంతకుమించి ఇక కెరియర్ ముగిసిపోయే దశలో ఉన్న ఒక సీనియర్ ప్లేయర్. ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజి కొనుగోలు చేసేందుకు ఇష్టపడని ఆటగాడు. అలాంటి ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు యాజమాన్యం   ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం కేవలం బేస్ ప్రైస్ కి అతని జట్టులోకి తీసుకున్నాడు. ధోని అతన్ని తీసుకొని తప్పు చేశాడు అని అందరూ అనుకున్నారు.

 కానీ ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు చూసిన తర్వాత ధోని మా మాస్టర్ మైండ్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవలే అతనికి తుది జట్టులో చోటు కల్పించగా.. ఇక ఇప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. నిజంగా రహనేనే అలా బ్యాటింగ్ చేస్తున్నాడా అని అటు ప్రేక్షకులు కూడా నమ్మలేకపోతున్నారు అని చెప్పాలి. టెస్ట్ ప్లేయర్ అని ముద్ర పడిన రహనే ఊహకందని రీతిలో బ్యాటింగ్ చేస్తూ చెన్నై జట్టుతో పాటు అందరిని ఆశ్చర్యపరిస్తున్నాడు.

 ఇక ఈ ఐపిఎల్ సీజన్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఎంతో మందిని ఏకంగా 199.04 స్ప్రైక్ రేటుతో రహానే బ్యాటింగ్ చేయగా.. ఇక 188 స్ట్రైక్ రేట్ తో మ్యాక్స్వెల్ బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి.  నికోలాస్ పూరన్ అయితే 185 రేట్తో రహానే తర్వాతే ఉన్నాడు. ఐపీఎల్ సీజన్ లో ప్రతి 9 బంతులకు ఒక సిక్స్ బాదుతూ ఉన్నాడు అజీంకే రహానే. అంతేకాదు అన్ని రకాల షాట్లు ఆడుతూ అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆడిన రివర్స్ స్కూప్ పై అయితే ఎంతో మంది మాజీ ప్లేయర్లు సైతం ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: