ధోని వల్లే.. ఐపీఎల్ కు ఈ రేంజ్ క్రేజ్ వచ్చింది : రవిశాస్త్రి

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ఇంత సక్సెస్  అవుతుందని ఇక ప్రారంభించిన వారు కూడా ఊహించి ఉండరు అనడంలో సందేహం లేదు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇక అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే అందరూ మహేంద్ర సింగ్ ధోని చెబుతారు. అదేంటి రోహిత్ శర్మ ఐదు సార్లు టైటిల్ గెలిచాడు కదా రోహిత్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కావాలి కానీ ధోని ఎలా అవుతాడు అని అనుమానం కొంతమందికి రావచ్చు.

 రోహిత్ అయిదు సార్లు టైటిల్ గెలిచినప్పటికీ ధోని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువసార్లు క్వాలిఫైయర్ కు తీసుకు వెళ్లిన కెప్టెన్గా.. ఎక్కువసార్లు ఫైనల్లో ఆడిన కెప్టెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ గణాంకాలతో పోల్చి చూస్తే రోహిత్ ధోని వెనకే ఉన్నాడు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ధోనీ తన కెప్టెన్సీ తో చెన్నై సూపర్ కింగ్స్ అంటే కేవలం ఒక సాదాసీదా టీం కాదు అది ఒక బ్రాండ్ అన్నట్లుగా అందరి అభిప్రాయాన్ని మార్చేశాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి మాట్లాడాడు.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంత సక్సెస్ సాధించింది అంటే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ధోని మ్యాచ్ ఆడుతున్నాడు అంటే ఫ్యాన్స్ భారీగా స్టేడియాలకు తరలివస్తారు. ఇక ధోని వల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది.  అతని గురించి మాట్లాడటానికి మాటలు కూడా లేవు. ఫ్యాన్స్ అందరూ అతన్ని తలా అని పిలుచుకుంటూ ఉంటారు. ధోని కెప్టెన్గా ఏకంగా నాలుగు సార్లు టైటిల్స్ సాధించాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: