చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. అరుదైన రికార్డు?

praveen
ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన రికార్డులు కలిగి ఉన్న ప్లేయర్ల లిస్టు తీస్తే అందులో మొదటి వరుస లో వినిపించే పేరు డేవిడ్ వార్నర్. కేవలం కొంత మంది భారత ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులను విదేశీ ప్లేయర్ అయినప్పటికీ డేవిడ్ వార్నర్ సాధించాడు అని చెప్పాలి. ఇక కొన్ని రికార్డుల విషయంలో అయితే భారత ఆటగాళ్లను కూడా దాటేసి అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎప్పటిలాగానే మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు.

 ఒకవైపు జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ విఫలమవుతున్న అతను మాత్రం బ్యాటింగ్లో ఒత్తిడికి లోను కాకుండా నిలకడైన ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఢిల్లీ జట్టు వరుసగా ఓటములు సాధిస్తూ ఉన్నప్పటికీ.. అటు డేవిడ్ వార్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో 285 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ 57 పరుగులతో రాణించగా.. ఢిల్లీ జట్టు మొదటి విజయాన్ని నమోదు చేసింది.

 అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ చేసిన 57 పరుగుల ద్వారా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు డేవిడ్ వార్నర్. కేవలం 26 మ్యాచ్లలోనే 146 సగటుతో ఒక వెయ్యి 75 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే అంతకుముందు ఇలా కోల్కతా జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ముంబై కెప్టెన్ రోహిత్ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 32 మ్యాచుల్లో ఒక వెయ్యి 40 పరుగులు చేయగా.. ఇప్పుడు ఈ రికార్డును డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: