CSK vs SRH: మ్యాచ్ కి ధోని దూరం.. షాక్ లో టీం?

Purushottham Vinay
ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈరోజు రాత్రి (ఏప్రిల్ 21) IPLలో పోటా పోటీగా తలపడనున్నాయి.ఇంకా ఈ మ్యాచ్‌ చెన్నై సొంత మైదానం అయిన ‘ఎంఏ చిదంబరం స్టేడియం, చెపాక్‌’లో జరగనుంది. ఈ మైదానం ఎప్పుడూ స్పిన్నర్లకు ఖచ్చితంగా చాలా అనుకూలంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ రెండు జట్లూ కూడా తమ మునుపటి ప్లేయింగ్-11లో మార్పులు చేసి అదనపు స్పిన్నర్లకు చోటు ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటుంన్నాయి.కివీ స్పిన్నర్ అయిన మిచెల్ సాంట్నర్ చెన్నై టీంలోకి తిరిగి రావచ్చని సమాచారం తెలుస్తోంది. సన్‌రైజర్స్ టీం తమ ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్‌ను ఈసారి రంగంలోకి దించవచ్చు. అంటే, రెండు టీమ్స్ తమ చివరి ఆడుతున్న ప్లేయింగ్ 11 నుంచి ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్‌కు బదులుగా ఒక విదేశీ స్పిన్నర్‌కు ఛాన్స్ ని ఇవ్వవచ్చు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు.


ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎంఎస్ ధోనీకి విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని ప్లేస్‌లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలని అప్పగించవచ్చని అంటున్నారు.చెన్నై టీం విషయానికి వస్తే..డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, MS ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆకాష్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మహిష్ తిక్ష్ణ ఇంకా అలాగే మిచెల్ సాంట్నర్ ప్లేయర్లు ఆడనున్నారు.ఇక హైదరాబాద్ టీం విషయానికి వస్తే..హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే ఇంకా అలాగే టి నటరాజన్ ప్లేయర్లు ఆడనున్నారు.మరి చూడాలి ఈరోజు ఏ టీం గెలుస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: