వైరల్ : సిరాజ్ కు రోనాల్డో పూనాడు.. ఇంతకీ ఏం చేశాడంటే?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య భారీ లోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తుంది. ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ ప్రదర్శన చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ అదరగొడుతుంది. అయితే ఇక ఈ ఏడాది ఆర్సిబి ప్రదర్శనతో అటు అభిమానులు కూడా సంతృప్తిగానే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం చేరిపోయింది.

 ఇటీవలే పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఏకంగా 174 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష చేదనకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. మాత్రం కేవలం 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. దీంతో ఇక పంజాబ్ కింగ్స్ జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ మ్యాచ్ లో హైదరాబాది బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు.

 అదే సమయంలో ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా మహమ్మద్ సిరాజ్ ను ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ రోనాల్డో పూనాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాట్స్మెన్ హర్ ప్రీత్ సింగ్ భాటియాను రనౌట్ చేయడం మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో విజయ్ కుమార్ వేసిన మూడో బంతిని ప్రభు సిమ్రాన్ సింగ్ మీడ్ ఆఫ్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే ప్రయత్నం చేసినా నాన్ స్ట్రైక్ లో ఉన్న హర్ ప్రీత్ భాటియాకు కాల్ ఇచ్చాడు. దీంతో హర్ ప్రీత్ పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్ మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో విసిరాడు. దీంతో హరిప్రీత్ క్రీజులోకి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రన్ అవుట్ అయ్యాడు. రనౌట్ చేసిన ఆనందంలో రోనాల్డో ఫేమస్ అయినా సూయి సెలబ్రేషన్ తో మెరిసాడు సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: