సీఎస్కే అభిమానులకు.. డబుల్ గుడ్ న్యూస్?

praveen
ఈ ఏడాది టైటిల్ విజేతగా నిలువడమే లక్ష్యంగా అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే  ఇక మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ఇక ఇప్పటివరకు ఉన్న జరిగిన నాలుగు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో ఘనవిజయాన్ని సాధించి పాయింట్లు పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.  అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అటు చెన్నై సూపర్ కింగ్స్ కి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నవారు గాయం బారిన పడుతూ దూరమవుతున్నారు.

జట్టులో కీలక బౌలర్గా ఉన్న దీపక్ చాహార్ ఇక మొదటి మ్యాచ్ లో బౌలింగ్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ చివరికి బౌలింగ్ వేయకుండానే వెనుదిరికాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్  తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఓటమితో పాటు ఇక జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని సైతం ఇక మోకాలి గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది.అయితే ఇప్పటికే జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న బెన్ స్టోక్స్ సైతం గాయం బారిన పడి జట్టుకు దూరంగా ఉన్నారు. దీంతో తర్వాత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటో అని తలచుకోవడానికే భయపడిపోతున్నారు అభిమానులు.

 ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ  ఒకటి కాదు ఏకంగా డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ లు అందాయి అని చెప్పాలి. ధోని మోకాలి గాయం పై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ధోని గాయంతో బాధపడుతున్న విషయం నిజమేనని.. అయితే సోమవారం చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరులో జరిగే మ్యాచ్లో అయినా కచ్చితంగా ఆడతాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లో మరో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ ఈనెల 30వ తేదీన పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్లో జట్టుకు అందుబాటులోకి వస్తాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు కాశీ విశ్వనాథన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ip

సంబంధిత వార్తలు: