ఐపీఎల్ లో అరుదైన రికార్డు.. అత్యంత వేగంగా 100 వికెట్లు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు రికార్డు సృష్టించడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్లో కూడా బరిలోకి దిగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగానే బౌలర్లు అందరూ కూడా నిప్పులు చెరుగుతూ బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తున్నారు అని చెప్పాలి. కొంతమంది ఏకంగా  తమ బౌలింగ్ వేగంతో ప్రత్యర్థులను భయపెట్టిస్తూ ఉంటే... మరి కొంతమంది ఏకంగా వికెట్లు పడగొట్టి రికార్డులు కొల్లగొడుతున్నారు.

 అయితే ఐపీఎల్ హిస్టరీలో ఎంతోమంది ప్లేయర్లు ఉండగా.. ఇక అత్యుత్తమ బౌలర్ల జాబితా గురించి మాట్లాడుకుంటే మాత్రం కగిసో రబడా పేరు తప్పక వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా అతను అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఏ జట్టులో కొనసాగినా కూడా సూపర్ బౌలింగ్ తో ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ఇటీవల కగిసో రబడా  ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. 2023 ఐపీఎల్ సీజన్లో తాను ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

 ఈ ఐపీఎల్ సీజన్లో కగిసో రబడా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా ఈ ఏడాది ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడాడు కగిసో రబడా.  ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో తొలి వికెట్ తీసిన రబాడ అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు అని చెప్పాలి. ఇక కగిసో రబడా  కేవలం 64 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. తర్వాత మలింగ  70 మ్యాచ్లలో, భువనేశ్వర్ కుమార్ 84 మ్యాచ్లలో, హర్షల్ పటేల్ 81 మ్యాచ్లు, రషీద్ ఖాన్ 83 మ్యాచ్లు, అమిత్ మీశ్రా 83, ఆశిష్ నెహ్ర 83, చాహల్ 84 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: