కెప్టెన్సీ నుంచి బాబర్ ఔట్.. భారీ స్కెచ్ వేసిన ఆఫ్రిది?

praveen
పాకిస్తాన్ క్రికెట్లో ఎప్పుడు ఏదో ఒక వివాదం పుట్టుకొస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఫీల్డ్ లోపల వివాదాలు చెలరేగితే.. మరికొన్నిసార్లు ఫీల్డ్ బయట ఇక వివాదాలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి వివాదాలు పాకిస్తాన్ జట్టులో అనూహ్యమైన మార్పులకు కారణం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి వివాదం ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు.. అదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్లో ఇలాంటి ఒక వివాదం తెరమీదకి వచ్చింది అన్నది తెలుస్తుంది.

 గత కొంతకాలం నుంచి బాబర్ ను  కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ పాకిస్తాన్ క్రికెట్లో డిమాండ్లు వినిపిస్తున్నాయ్. దీనికి కారణం గత కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్  ప్రత్యర్ధుల చేతిలో ఏకంగా స్వదేశంలోనే ఓడిపోవడం. ఇకపోతే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని షాహిద్ ఆఫ్రిది నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ కోరినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీప్ నాజం సేతి వెల్లడించారు. ఏకంగా షాహిద్ ఆఫ్రిది నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకున్న వెంటనే బాబర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం గురించి మొదట మాట్లాడారు అంటూ సేతి ఒక యూట్యూబ్ ఛానల్ తో చెప్పుకొచ్చాడు.

 ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ జట్టులో మార్పు అవసరమని.. అందుకే బాబర్ను కెప్టెన్గా తొలగించాల్సిన సమయం వచ్చేసింది అంటూ కమిటీ తనతో చర్చలు జరిపింది అని గుర్తు చేసుకున్నాడు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ పెద్ద సిరీస్ లేదా టోర్నమెంట్ను గెలవలేకపోయింది. ఆసియా కప్ ఫైనల్ శ్రీలంక చేతిలో ఓటమిపాలింది. ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇది ఒకటే కాదు బాబర్ సొంత దేశంలో కూడా జట్టును గెలిపించలేకపోయాడు. ఇలా బాబర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు ఏ టోర్నీ గెలవలేదని.. అందుకే అతన్ని తప్పించాలి అంటూ తాత్కాలిక సెలక్షన్ కమిటీ చెప్పిందని ఇక పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సేతి వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: