'జైచిరంజీవ'లో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడెలా మారిందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోల వారసులది మాత్రమే కాదు ఏకంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులది కూడా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూతుర్లు గాను కొడుకులు గాను లేదా ఇతర కీలకపాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇక ఇప్పుడు పెద్దయ్ అదే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా మారుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఇలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తింపు సంపాదించుకున్న వారి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

 ఇలా అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రియా శర్మ కూడా ఒకరు అని చెప్పాలి. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ ఈరోజు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది శ్రియ శర్మ. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించిన చిన్నారి శ్రీయ శర్మ అని చెప్పాలి. ముద్దు ముద్దు మాటలతో అప్పట్లో ప్రేక్షకుల మదిని దోసేసింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు, రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ, నాని హీరోగా వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

 కేవలం తెలుగులోనే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి.  అంతేకాదు ఇక హిందీలో పలు టీవీ సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది అని చెప్పాలి. ఇక 2017లో గాయకుడు అని సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో బిల్లు గేమర్ అనే సినిమాలో నటించింది. 2016లో రోషన్ సరసన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది. ఇక ఈ అమ్మడి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. తండ్రి ఇంజనీర్ కాగా తల్లి డైటీషియన్.  చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియ శర్మ ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈమెకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: