ఐపీఎల్ లో.. ఆ జట్టులో ఆడాలని ఉంది : పాక్ ప్లేయర్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కేవలం ఒక దేశవాళి లీగ్ అయినప్పటికీ అటు ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఊహించిన రీతిలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అంతేకాదు ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు కూడా ఫ్యూచర్ స్టార్స్ ను అందించే ఒక మంచి ప్లాట్ఫారం గా కొనసాగుతుంది ఐపీఎల్. ఈ క్రమంలోనే దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో భాగం కావాలని ఇష్టపడుతూ ఉంటారు. స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు మాత్రమే కాదు తమ దేశ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాలనుకునే యువ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పాల్గొనడం కారణంగా అటు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మంచి గుర్తింపును సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందని ప్రతి ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక మెగా వేలం సమయంలో ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తేనే.. ఐపీఎల్ క్రేజ్ ఏంటో అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక ఐపీఎల్ లో ఆడేందుకు అందరికీ అవకాశం ఉంది. కానీ ఒక పాకిస్తాన్ ప్లేయర్లకు క్రికెట్లో నిషేధం దృశ్య ఆ అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్ గురించి మాట్లాడే కొంతమంది పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతగానో మిస్ అవుతున్నాం అంటూ చెబుతూ ఉంటారు. ఇటీవల పాకిస్తాన్ యంగ్ బ్యాట్స్మెన్ శ్యామ్ ఆయుబ్ తన మనసులో మాటను బయటపెట్టాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు తరుపున ఆడాలని ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెట్లో కోహ్లీ లెజెండ్ గా మారడం అభినందనీయమని తెలిపాడు. తాను ఐపీఎల్ను అనుసరిస్తానని.. ఆర్సిబి జట్టులో చేరితే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ అయినా కోహ్లీతో కలిసి ఆడే ఛాన్స్ ఉంటుందని మనసులో మాట బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: