వైరల్ : వికెట్ తీసిన ఆనందం.. అసభ్యంగా సెలబ్రేషన్స్?

praveen
క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  జరుగుతున్న సమయంలో ప్రతి బౌలర్ కూడా వికెట్ తీయడమే లక్ష్యంగా ప్రతి బంతిని కూడా సంధిస్తూ ఉంటాడు. కానీ ప్రతి బంతికి వికెట్ దక్కడం అసాధ్యమని చెప్పాలి. కానీ ఇక వికెట్ దక్కినప్పుడు మాత్రం బౌలర్ ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకోవడం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా వికెట్ దక్కినప్పుడు కొంతమంది బౌలర్లు వింతైన సెలబ్రేషన్స్ చేసుకొని అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా వింత సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇటీవల ఇలాంటిదే జరిగింది. యూఏఈ జట్టుకు చెందిన ఒక ఆటగాడు వికెట్ దక్కిన ఆనందంలో పరిమితులను దాటేసి అసభ్యంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అతను ఎవరో కాదు యూఏఈ జట్టులో ఆల్రౌండర్ గా కొనసాగుతున్న రోహన్ ముస్తఫా. బౌలింగ్ చేస్తున్న సమయంలో అద్భుతమైన రిటర్న్ క్యాచ్ పట్టాడు రోహన్ ముస్తఫా. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో వింత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అని చెప్పాలి.

 ఏకంగా నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్తో అసభ్యంగా ప్రవర్తించాడు. బంతిని నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ గార్డ్ దగ్గర తాకిస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు అని చెప్పాలి. యూఏఈ వర్సెస్ జెర్సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. జెర్సీ ఇన్నింగ్స్ 21 ఓవర్లు రోహన్ ముస్తఫా బౌలింగ్ వేశాడు. ఈ క్రమంలోనే నాలుగో బంతికి వికెట్ తీశాడు. దీంతో సంతోషాన్ని పట్టలేకపోయిన రోహన్ ముస్తఫా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ హారిసన్ క్లారియన్ ఏడి గార్డుపై బాల్ ఉంచుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతని చర్యలు చూసి హారిసన్ సైతం షాక్ అయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: