వన్డే క్రికెట్ హిస్టరీలో.. యూఎస్ఏ బౌలర్ సంచలనం?

praveen
అసలు సిసలైన ఉత్కంఠకు క్రికెట్ అనే ఆట సరైన ఉదాహరణ అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతూ ఉంటుంది. అదే సమయంలో సాధ్యం అనుకున్నది కొన్ని కొన్ని సార్లు అసాధ్యంగా మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారో అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. కొంతమంది బౌలర్లు  కొన్ని కొన్ని సార్లు అసామాన్యమైన ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు.

 మరి కొన్నిసార్లు కీలకమైన మ్యాచులలో పసికూన అని తక్కువ అంచనా వేసిన జట్లే మంచి విజయాలను సాధించడం లాంటివి చూస్తూ ఉంటాం. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే  వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ లో క్వాలిఫై అయ్యేందుకు కొన్ని జట్లు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైర్ ప్లే ఆఫ్స్  లో భాగంగా జెర్సీ టీం పై యూఎస్ఏ బౌలర్ అలీ ఖాన్ సంచలన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

 ఈ మ్యాచ్లో 9.4 ఓవర్లు వేసిన అలీ ఖాన్ 32 పరుగులు ఇచ్చాడు. అయితే ఏకంగా కీలకమైన ఏడు వికెట్లు తీశాడు అని చెప్పాలి. వన్డే క్రికెట్ చరిత్రలో ఇక ఇవి అరుదైన గణాంకాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్డే క్రికెట్ హిస్టరీలో ఇవి ఏడో బెస్ట్ గణంకాలు కావడం గమనార్హం. ఈ జాబితాలో చమిందా వాస్ 8/ 19, షాహిద్ ఆఫ్రిది 7/12, మెక్ గ్రాత్ 7/15, రషీద్ ఖాన్ 7/18, అండీ బిచేల్, 7/20 మురళీధరన్, 7/30 స్థానంలో ఉన్నారు అని చెప్పాలి.. ఇలా మంచి ప్రదర్శన కనబరిచిన బౌలర్ పై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: