ఐపీఎల్ లో వచ్చిన మొదటి ఛాన్స్ లోనే.. దుమ్ము దులిపేసాడు?

praveen
ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే ఢిల్లీకి చుక్కలు చూపించేశాడు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మరియు వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మేయర్స్. గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఏడాది 50 లక్షలకు మేయర్స్ ని కొనుగోలు చేసినప్పటికీ తుది జట్టుకు సెలెక్ట్ కాకపోవడంతో ఒక మ్యాచ్ లో కూడా ఆడలేకపోయాడు. కానీ ఈసారి లక్నో జట్టుకు మొదటి మ్యాచ్ లోనే ఢిల్లీతో ఆడే అవకాశం రావడంతో ఓపెనర్గా బరిలోకి దిగి తనదైన బ్యాటింగ్ తో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఆడిన మొదటి మ్యాచ్ కి చాలా సులువుగా సిక్సర్లు బాధపడటంతో తన బ్యాట్కు పని చెప్పిన మేయర్స్ 38 బంతులకి 73 పరుగులు సాధించాడు.
ఇక చివరి సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ లో మెంబెర్ గా ఉన్న 30 ఏళ్ల మేయర్ తుది చెట్టులో ఒక్కసారి కూడా సెలెక్ట్ కాకపోయినా విజేత అయిన జట్టులో ఉండడం వల్ల తన ఆటతీరులో ఎంతో నైపుణ్యత పెంచుకునే అవకాశం దక్కింది దాంతో లక్నో తరుపున ఆడి చెలరేగిపోయాడు. గుజరాత్ జట్టులో ఆడటం వల్ల తనకు ఎంతో ఉపయోగకరంగా ఉండిందని ఆటలో ఎంతో నేర్చుకున్నాను అంటూ మేయర్స్ తెలుపుతున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ లో తనకు ఆడే అవకాశం రాకపోవడం బాధాకరం అయినప్పటికీ తన ఆట తీరు మాత్రం మెరుగుపడింది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సీజన్లో ఆడాలనేది నా కల అంటూ చెబుతున్న మేయర్స్ ఇప్పుడు నా అవకాశం దక్కిందని తన సత్తా ఏంటో చూపియ్యాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని ఢిల్లీతో ఆడిన మొదటి మ్యాచ్ లో మంచి ఆరంభం ఇవ్వడంతో తన కల నెరవేరింది అంటూ చెబుతున్నాడు.
క్వింటన్ డికాక్ ప్లేస్ లో లక్నో జట్టులోకి వచ్చిన మేయర్స్ ఎదురుగా ఏ జట్టు ఉందనే సంగతి పక్కన పెట్టి స్పిన్నర్లను ఉతికి ఆరేశాడు. బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు మేయర్స్ వంటి స్టార్ ఆటగాడి సహాయంతో 193 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థం ముందు పెట్టడంతో ఆ లక్ష్యాన్ని చేదించడంలో ఢిల్లీ విఫలమై కేవలం 143 పరుగులు చేసి ఓటమి చవి చూసింది. చాలామంది ఆటగాళ్లకు మొదటి మ్యాచ్ లోనే బాగా ఆడాలని కోరిక ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుంది లక్నో తరుపున ఆ మేయర్స్ ఇలా భారీ పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక బాధ్యత పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: