రోహిత్ దూరం.. హార్దిక్ పాండ్యాకు వన్డే కెప్టెన్సీ?

praveen
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడల్లా ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. అదే హార్దిక్ పాండ్యా. మొన్నటివరకు టీం ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్థిక్ పాండ్యా గత ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్తో తన నాయకత్వ ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ జట్టుకు టైటిల్ అందించి.. ఇక అటు భారత కెప్టెన్సీ రేస్ లో అందరిని వెనక్కినెట్టి ముందు వరుసలోకి వచ్చేసాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక తాత్కాలిక కెప్టెన్ అని చెబుతున్నప్పటికీ.. ఇక టీమ్ ఇండియా ఆడుతున్న అన్ని టి20 సిరీస్ లకు హార్దిక్ పాండ్యానే సారధ్య బాధ్యతలు నిర్వహిస్తూ  ఉన్నాడు అని చెప్పాలి.

 అతని సారధ్యంలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా జట్టు పొట్టి ఫార్మాట్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఉంది. ఇక తన నాయకత్వ ప్రతిభతో ఏకంగా మాజీ ఆటగాల్లను సైతం ఫిదా చేసేస్తూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. అయితే హార్దిక్ పాండ్యా కేవలం టి20 కెప్టెన్ గా మాత్రమే కాదు త్వరలో వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా కూడా మారబోతున్నాడు అన్న టాక్ గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అడుగులు పడుతూ ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈనెల 17వ తేదీ నుంచి అటు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు పాండ్య.

 మొదటి వన్డే మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఇక హార్దిక్ పాండ్యాకు సారధ్య  బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏకంగా జట్టులో కోహ్లీ, కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లను తన కెప్టెన్సీలో ముందుకు నడిపించబోతున్నాడు హార్థిక్. ఇక వాంకండే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి. ఇక ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలబడటం ఇది ఐదోసారి. అందులో మూడుసార్లు ఆస్ట్రేలియా రెండుసార్లు భారత్ గెలిచాయి. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: