ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది?

praveen
మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ ఐపీఎల్ లాగానే అటు మహిళల కోసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన జరిగిన వేలంలో కూడా ఎంతోమంది ప్లేయర్లు కోట్ల రూపాయలు ధర పలికారు అని చెప్పాలి.  ఇక ఇప్పుడు అన్ని జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా మ్యాచ్లు జరుగుతున్న సమయంలోనే ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు అన్న విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి.

 ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆ జట్టు ప్రదర్శన గురించే చర్చించుకుంటున్నారు. ఆ జట్టు ఏదో కాదు ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ గెలిచి ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కావడం గమనార్హం. ఈ ఛాంపియన్ టీమ్ అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో బలిలోకి దిగింది. అయితే ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఐదు మ్యాచ్ల్లో కూడా విజయం సాధించింది. ఇటీవల గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇలా అన్ని జట్లు కూడా గెలుపు ఓటములతో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంటే.. అటు ముంబై ఇండియన్స్ మాత్రం తాము ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఛాంపియన్ అన్న విషయాన్ని నిరూపిస్తుంది అని చెప్పాలి. దీంతో ముంబై ఇండియన్స్ టీం జైత్రయాత్ర చూస్తూ ఉంటే ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచేది ఈ జట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అని సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఎన్ని మ్యాచ్లు జరిగిన ముంబై ఇండియన్స్ కు పోటీ ఇచ్చే జట్టే కనిపించడం లేదు అనడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: