డబ్ల్యూటీసి ఫైనల్.. ఐసీసీపై ఆసిస్ మాజీ అసంతృప్తి?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. దాదాపు గత మూడేళ్ల నుంచి హోరాహోరీగా జరిగిన పోరులో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. మొదట ఫైనల్లో అడుగుపెట్టిన టీం గా నిలిచింది. టీమిండియా జట్టు కూడా ఫైనల్ అడుగుపెట్టిన రెండవ జట్టుగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇరుజట్లు కూడా అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన విశ్వవిజేతగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి.

 కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇంకా చాలా గ్యాప్ ఉంది అని చెప్పాలి. ఏకంగా జూన్ నెలలో ఈ మ్యాచ్ను నిర్వహించేందుకు అటు ఐసిసి ఇప్పటికే షెడ్యూలు కూడా ప్రకటించింది అని చెప్పాలి. అయితే జూన్లో డబ్ల్యూటీసి ఫైనల్ పెట్టడంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు బీసీసిఐ నిర్వహించే ఐపీఎల్ కోసమే ఐసీసీ డబ్ల్యూటీసి ఫైనల్ షెడ్యూల్ అడ్జస్ట్ చేసింది అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. బీసీసీఐ చెప్పినట్లుగానే ఐసీసీ వింటుంది అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ను జూన్ నెలలో నిర్వహించడానికి ఐసిసి నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఫైనల్ మ్యాచ్ కోసం అంత సుదీర్ఘమైన గ్యాప్ ఇవ్వడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇంతకీ ఐసీసీ ఏం చేస్తుంది.. ఫైనల్ మ్యాచ్ కోసం మూడు నెలల విరామమా.. ఐసీసీ ఇప్పటికైనా మేలుకో.. ఇంత గ్యాప్ ఉంటే ఫాన్స్ లో ఇప్పుడు ఉన్న ఉత్సాహం మొత్తం పోతుంది.. ఐపీఎల్ తర్వాత ఫైనల్ నిర్వహిస్తే అప్పటికి మ్యాచ్ చూసేందుకు ఎవరు ఆసక్తి చూపరు.. అందుకే ఈలోగా ఫైనల్ నిర్వహించాలి అంటూ బ్రాడ్ హగ్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: