WPL: RCB చెత్త ప్రదర్శన.. ఒత్తిడిలో స్మృతి మందన?

Purushottham Vinay
ఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి దాకా RCB ప్రదర్శన నిరాశపరిచింది. తన ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఏకంగా 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తర్వాత మ్యాచ్‌లో ముంబైపై కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఈ మ్యాచ్‌లో ముంబై మొత్తం 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇక గుజరాత్‌ 11 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. అలాగే యూపీ వారియర్స్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీపై ఐదో ఓటమిని చవిచూడటం జరిగింది. ఇక ఢిల్లీ చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇక టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి స్మృతి మందనకు అంతగా కలిసి రాలేదని చెప్పాలి.ఎందుకంటే కెప్టెన్సీ ఒత్తిడితో ఆమె సతమతమవుతోంది.


అందువల్ల ఈ డబ్ల్యూపీఎల్‌లో మాత్రం తన ప్రతిభకు దూరంగా ఉండిపోయింది.ఇక సోమవారం నాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆమె కేవలం 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.సోమవారం నాడు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి మొత్తం 150 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆలిస్ ప్యారీ చాలా అద్భుతంగా ఆకట్టుకుంది.  52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 67 పరుగులు చేయడం జరిగింది. ఇక రిచా ఘోష్ 37 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు ఇంకా 3 సిక్సర్లు బాదింది.ఇక ఆర్సీబీ టీం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఢిల్లీ టీం తరపున జెమీమా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. మరిజన్ కాప్ 32 పరుగులు చేయడం జరిగింది. జోన్సన్ ఇన్నింగ్స్ 29 పరుగులు చేయడం జరిగింది. ఇంకా అలాగే ఎల్లిస్ కాప్సే 24 బంతుల్లో 38 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: