అందుకే ఓడిపోయాం.. స్మిత్ ఏం కారణం చేపాడో తెలుసా?

praveen
భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఇక ఈ టెస్ట్ మ్యాచ్ పసలేని  విధంగా జరిగినప్పటికీ.. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ కు వచ్చేసరికి మాత్రం నువ్వా నేనా అన్నట్లుగానే హోరాహోరీ పోరు జరిగింది అని చెప్పాలి.  మొదటి రెండు మ్యాచ్లలో భారత జట్టు అలవోకగా విజయం సాధించింది. కానీ మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా మొదటి ఇన్నింగ్స్ లోనే 480 పరుగుల భారీ స్కోరు చేసింది.. దీంతో టీమిండియా ఇంత పెద్ద టార్గెట్ ను చేదిస్తుందా లేదా.. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ ను సమం చేస్తుందా అనే దానిపై కూడా చర్చ జరిగింది అని చెప్పాలి. కానీ కొండంత టార్గెట్ ను ముందు పెట్టుకుని అద్భుతంగా రాణించిన టీమిండియా అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక హోరాహోరీగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది అని చెప్పాలి. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

 ఇకపోతే ఇక నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోల్పోవడం గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ కోల్పోవడం ఎంతగానో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. సిరీస్ ప్రారంభంలో కాస్త వెనుకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాం అంటూ తెలిపాడు. ఢిల్లీ టెస్టులో ఒక సెషన్ లో చేసిన తప్పుల వల్లే మ్యాచ్ను దూరం చేసుకుని.. ఇక సిరీస్ కోల్పోయాము అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో మా బౌలర్లు మర్పి, కొనేమన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాథన్ లియోన్ ఎప్పటికీ అత్యుత్తమమే అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: