సిరీస్ విజయంతో.. చరిత్ర సృష్టించిన టీమిండియా?

praveen
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు మరోసారి సత్తా చాటింది అని చెప్పాలి. గత కొన్నెళ్ల నుంచి కూడా అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా  సిరీస్ లు  గెలుచుకుంటూ సత్తా చాటుతూ వస్తుంది.  అయితే ఈ సిరీస్ అటు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన లేదంటే భారత్ లో జరిగిన కూడా టీమిండి టీమిండియాదే  పై చేయి అన్న విధంగా ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక అయితే ఇటీవల  భారత గడ్డపై ఆస్ట్రేలియా తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మరోసారి సత్తా చాటింది. నాలుగు టెస్ట్ మ్యాచ్లలో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టు మూడో మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. దీంతో ఇక సిరీస్ కైవసం చేసుకోవాలంటే నాలుగో మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇరు జట్ల మధ్య కూడా హోరా హోరీగా పోరు జరిగింది అని చెప్పాలి. దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగానే ముగిసింది అని చెప్పాలి. దీంతో అప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన టీమ్ ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

 అయితే ఈ సిరీస్ గెలుచుకోవడం ద్వారా అటు టీమిండియా జట్టు ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఏకంగా 16వ టెస్టు సిరీస్ ను సొంత గడ్డపైనే కైవసం చేసుకుంది టీం ఇండియా. 2013 నుంచి వరుసగా ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్,ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై స్వదేశంలో భారత్ సిరీస్ లు గెలిచింది అని చెప్పాలి. అలాగే 2016 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు సార్లు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా.. 30 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక టీం గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: