చరిత్ర సృష్టించిన నాథన్ లియాన్.. భారత గడ్డపై అతనే తోపు?

praveen
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అంచనాలకు మించిన ప్రదర్శన చేస్తూ తరచు వార్తల్లో  నిలుస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. తమ జట్టులో ఉన్న ఇతర బౌలర్లు అందరూ  కూడా విఫలమవుతున్న వేళ నాథన్ లియాన్ మాత్రం తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టని నాథన్ లియాన్.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో మాత్రం ఏకంగా 18 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక అదే జోరును కొనసాగిస్తూ ఇకవరుసగా వికెట్లను పడగొడుతూనే ఉన్నాడు.

 ఈ క్రమంలోనే నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఏకంగా ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకుంటున్నారు భారత బ్యాట్స్మెన్లు. కొంతమంది ఒత్తిడిలో మునిగిపోయి ఇక వికెట్ సమర్పించుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు అని చెప్పాలి. ఇలా భారత గడ్డపై మెరుగైన ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తున్న ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్. ఇక ఇటీవలే మరో అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.  భారత గడ్డపై అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్గా రికార్డు సృష్టించాడు. మొన్నటికి మొన్న నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ అశ్విన్ ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు  లియోన్ సైతం అలాంటి రికార్డ్  సృష్టించాడు.

 అయితే ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండు స్పిన్నర్ అండర్ వుడ్ పేరిట ఉండేది. భారత గడ్డపై 16 టెస్ట్ మ్యాచ్లో 54 వికెట్లు పడగొట్టాడు ఇంగ్లాండ్ స్పిన్నర్ అండర్ గుడ్. ఇక ఇప్పుడు నాథన్ లియాన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 11 టెస్ట్ మ్యాచ్ లలోనే 55 వికెట్లు పడగొట్టి భారత గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన విదేశీ బౌలర్గా చరిత్రను తిరగ రాశాడు అని చెప్పాలి. నాలుగో టెస్ట్ మ్యాచ్లో కేఎస్ భరత్ వికెట్ పడుకుంటడం ద్వారా ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా ఇక భారత జట్టుపై అత్యంత విజయవంతమైన బౌలర్గా కూడా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 26 టెస్టు మ్యాచ్లో 115 వికెట్లు పడగొట్టాడు నాథన్ లియాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: