కెరియర్ లో మొదటిసారి.. స్టార్ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా?

praveen
తొలివలపు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రస్తానాన్ని మొదలు పెట్టాడు గోపీచంద్. ఇక ఆ తర్వాత హీరోగా కంటిన్యూ కాకుండా ఒక్కసారిగా విలన్ అవతారం ఎత్తాడు అని చెప్పాలి. జయం అనే సినిమాతో విలన్ గా అవతారమెత్తిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గానే కంటిన్యూ అయ్యాడు. ఇక వర్షం, నిజం అనే సినిమాల్లో కూడా తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఏమనుకున్నాడో ఇక హీరోగా యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో యాక్షన్ సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను కూడా అందుకున్నాడు గోపీచంద్.

 రణం, లక్ష్యం, సౌర్యం, లౌక్యం లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా మాస్ హీరోగా ఎంతగానో దగ్గర అయ్యాడు అని చెప్పాలి. కానీ గత కొంతకాలం నుంచి గోపీచంద్ కు సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన గోపీచంద్ ఇక ఇప్పటివరకు ఒక్క స్టార్ దర్శకుడి సినిమాల్లో కూడా నటించకపోవడం గమనార్హం. అయితే గోపీచంద్ మళ్ళీ ఒక పెద్ద హిట్టు కొట్టి ట్రాక్ లోకి రావాలని అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనె ప్రస్తుతం గోపీచంద్ ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసి హిట్టు కొట్టిన శ్రీను వైట్లతో త్వరలో గోపీచంద్ సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది  అయితే ఒకప్పుడు ఇండస్ట్రీని వరుస హిట్లర్తో షేక్ చేసిన శ్రీను వైట్ల ఇక ఇప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు అని చెప్పాలి. ఇక ఏ హీరో కూడా ఆ డైరెక్టర్ నమ్మి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో గోపీచంద్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్టార్ దర్శకుడితో అయినా గోపీచంద్ కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: