వావ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా?

praveen
ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్ట్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఇక బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్న పిచ్ పై అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లందరూ కూడా రెచ్చిపోయారు అని చెప్పాలి. ఏకంగా 480 పరుగుల భారీ స్కోర్ చేశారు అని చెప్పాల. అయితే మొదటి మ్యాచ్ నుంచి బ్యాటింగ్లో తడబడుతూ కేవలం బౌలింగ్ విభాగం కారణంగానే విజయం సాధిస్తూ వచ్చిన ఇండియా.. నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారీ టార్గెట్ ను ఎలా చేదిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారత జట్టు అసాధారణమైన ప్రదర్శనతో నాలుగో టెస్ట్ మ్యాచ్లో అదరగొడుతుంది అని చెప్పాలి. ఏకంగా ఇప్పటికే 500 రన్స్ పూర్తి చేసుకుంది. కాగా ఎన్నో రోజుల నుంచి సెంచరీ అనే పదానికి దూరమైపోయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం సెంచరీ తో కదం తొక్కి ఎన్నో రికార్డులను సృష్టించాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికి ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన టార్గెట్ ను చేదించి లీడ్ లోకి వచ్చిన భారత జట్టు మరో అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది.

 ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో తొలి ఆరు వికెట్ల వరకు కూడా ప్రతి వికెట్ కి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది భారత జట్టు. తద్వారా 28 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి. గతంలో భారత జట్టు 1993లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి 5 వికెట్లకు కూడా ప్రతి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నేలకొల్పింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ రికార్డులు బద్దలు కొట్టేసింది భారత జట్టు. ఇప్పటికే భారత జట్టు 500 పరుగుల వద్ద ఉండగా.. ఈ స్కోర్ మరింత పెరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇదే జోరు కొనసాగిస్తే ఇండియా తప్పకుండా గెలవడం ఖాయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: