జడ్డు దెబ్బకు క్లీన్ బౌల్డ్.. స్మిత్ ఓవరాక్షన్?

praveen
ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు ఎట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కావడం గమనార్హం. ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే అటు భారత జట్టు సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుంది. అదే ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం చేసే గత కొన్ని సీజన్ల నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంటున్న టీమ్ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ వేస్తుంది.

 ఈ క్రమంలోనే ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.  ఇకపోతే ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా అటు భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చాలానే కష్టపడుతున్నారు అని చెప్పాలి. మొదటి రెండు వికెట్లు పడిన తర్వాత ఇక మరో 40ఓవర్ల వరకు టీమ్ ఇండియాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బౌలర్లను మారుస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే బౌలింగ్ వేయడానికి వచ్చిన రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. కీలకమైన సుమిత్ వికెట్ పడగొట్టాడు.

 అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి టచ్ లో కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అప్పటికే 135 బంతులు ఎదుర్కొని పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు స్టీవ్ స్మిత్. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయినప్పటికీ అతన్ని అవుట్ చేసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు రవీంద్ర జడేజా. జడేజా సంధించిన బంతితో ఒక్కసారిగా ఒత్తిడికి గురైన స్మిత్ క్లీన్ బౌల్డ్ అవ్వగానే తన బ్యాట్ ను అసహనంతో నేలకేసి కొట్టాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ స్మిత్ ఇంత  ఓవరాక్షన్ ఎందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: