ఉజ్జయిని ఆలయంలో కోహ్లీ.. ఈసారి కూడా సెంచరీ ఖాయమా?

praveen
విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి ప్రస్తుతం భారత క్రికెట్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు వైఫల్యంతో ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తన కెరీర్ లో ఎన్నడు లేనంతగా విరామం కూడా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే అదిరిపోయే సెంచరీ చేసి మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా కొన్ని రోజుల వ్యవధిలోనే వరుస సెంచరీలు బాది మళ్ళీ ప్రపంచ రికార్డుల వేట ప్రారంభించాడు.

 దీంతో కోహ్లీకి తిరుగులేదు. అతను తోపు అని మళ్ళీ తిట్టిన వల్లే పొగడటం ప్రారంభించారు. కానీ ఇక ఇలా పొగిడిన వారే మళ్లీ తిట్టిపోస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీనికి కారణం ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో వరస వైఫల్యాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. అయితే మూడు మ్యాచ్లలో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉన్నా నాలుగో మ్యాచ్లో మాత్రం కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత భార్య అనుష్కతో కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించాడు. విశిష్టమైన భస్మహారతిలో కూడా పాల్గొని దేవుడి సన్నిధిలో ఆశీస్సులు పొందాడు  అయితే ఇంతకుముందు వీరు రిషికేసులో స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని, బృందావనంలోని పాపాని కరోలి ఆశ్రమాన్ని సందర్శించారు. తర్వాతే కోహ్లీ శ్రీలంక పై సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు మహాకాళేశ్వర్ ఆలయ సందర్శన అనంతరం కూడా కోహ్లీ టెస్టుల్లో శతకం సాధిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: