చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే సెలెక్టర్లు రిజైన్ చేయాలి : గవాస్కర్

praveen
గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇక భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును ఇక ఇలా కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ దూరమవుతున్న నేపథ్యంలో  వరుస ఎదురుదెబ్బలు  తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. సాధారణంగానే భారత జట్టును ఇక సొంత దేశంలో ఓడించడం అసాధ్యం. ఒకవేళ ఓడించాలి అనుకుంటే పూర్తి బలంతో బలిలోకి దిగాల్సి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం అలా చేయడం లేదు.

 జట్టులో ఉన్న కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకొని ఆ దేశ క్రికెట్ బోర్డు ఫిట్నెస్ తో లేని ఆటగాళ్లను సైతం జట్టులోకి ఎంపిక చేస్తుంది. ఇక ఇలా టీమ్ లోకి వచ్చిన ఆటగాళ్ళు సరిగా ఆడలేక గాయం తీవ్రత ఎక్కువై మళ్ళీ జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు వరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కూడా రెండు మ్యాచ్లో భారత్ గెలిస్తే ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది అని చెప్పాలి. ఇకపోతే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్  ఆస్ట్రేలియా సెలెక్టర్ల తీరు గురించి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 ఆస్ట్రేలియా సెలెక్టర్లు రిజైన్ చేస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఫిట గా లేని ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారు అంటూ ప్రశ్నించాడు సునీల్ గవాస్కర్. టీమ్ మేనేజ్మెంట్ 12 మంది ఆటగాళ్ల నుంచి 11 మందిని తుది జట్టులోకి ఎలా తీసుకుంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా సెలెక్టర్లకు ఏమాత్రం చిత్తశుద్ధి బాధ్యత ఉన్న వెంటనే రిజైన్ చేయాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు పిచ్ ల గురించి మాట్లాడటం మానేసి సెలెక్టరు ఏం చేస్తున్నారో గమనించాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: